Telugu News

స్మార్ట్ కిడ్జ్ లో అంబరాన్నంటిన “హోళీ” సంబరాలు*

ఖమ్మం-విజయం న్యూస్

0

స్మార్ట్ కిడ్జ్ లో అంబరాన్నంటిన “హోళీ” సంబరాలు*

(ఖమ్మం-విజయం న్యూస్)

రంగుల పండుగ హోళీ వేడుకలను “స్మార్ట్ కిడ్జ్” పాఠశాల లో అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. సుఖం,దుఃఖం, ఆనందం,విచారం ఇలా అన్నింటిని కలిపిన పండుగే “హోళీ”. వసంత రుతువు ఆగమనానికి సూచికగా భావిస్తున్న హోళీ పండుగను స్మార్ట్ కిడ్జ్ పాఠశాల చిన్నారులు ఆద్యంతం ఉల్లాసంగా ఉత్సాహంగా జరుపుకున్నారు. పాఠశాల ఉపాధ్యాయులు ముందుగా “హోళీ” పండుగ విశిష్టతను చిన్నారులకు వివరించారు.చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా భావించాలని అన్నారు.

also read;-మంత్రి ఎర్రబెల్లి హోలీ కోలాటం

చిన్నారులు “హోళీ” వేడుకలో భాగంగా తమ తోటి చిన్నారులకు రంగులు చెల్లి ఉత్సాహం సంబరంతో పాల్గొన్నారు. పాఠశాల చిన్నారులు ఒకరికి ఒకరు హోలీ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ చింత నిప్పు కృష్ణ చైతన్య మాట్లాడుతూ, మన సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందించాలనే సంకల్పంతోనే ఇటువంటి వేడుకలను నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ వేడుకలలో పాఠశాల ఉపాధ్యాయులు మరియు సిబ్బంది, చిన్నారులు పాల్గొన్నారు.