Telugu News

విద్యాసంస్థలకు సెలవులు

ఈనెల 8 నుంచి 16 వరకు సెలవులను ప్రకటించిన సీఎం కేసీఆర్

0

విద్యాసంస్థలకు సెలవులు
%% ఈనెల 8 నుంచి 16 వరకు సెలవులను ప్రకటించిన సీఎం కేసీఆర్
%% కరోనా, ఒమిక్రాన్ ప్రభావం పిల్లలపై పడోద్దని నిర్ణయం
%% వైద్యారోగ్యశాఖ సమీక్షలో కీలక నిర్ణయం
(హైదరాబాద్-విజయంన్యూస్)
తెలంగాణలోని విద్యా సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఈ నెల 8 నుంచి 16 వరకు అన్ని విద్యా సంస్థలకు సెలువులు ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. రాష్ట్రంలో ఒమిక్రాన్, కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్, వైద్యారోగ్య శాఖపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

also read :-ఆయనో తహశీల్దార్ కానీ చిరంజీవి స్టెప్పులతో రఫ్ఫాడించాడు

ఈ మేరకు సుదీర్ఘంగా సమీక్షించిన అనంతరం సీఎం కేసీఆర్ బ్రేకింగ్ డిసిషన్ తీసుకున్నారు. కరోనా, ఒమిక్రాన్ కేసులను నియంత్రించడంతో పాటు ఆ ప్రభావం చిన్న పిల్లలపై పడకుండా ఉండేందుకు గాను సెలవులు ప్రకటించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సీఎం కేసీఆర్‌ విద్యాశాఖకు ఆదేశాలు ఇచ్చారు. సుమారు 9 రోజుల పాటు పాఠశాలలకు సెలవులను ప్రకటించాలని, ఆ తరువాత పరిస్థితిని భట్టి నిర్ణయించాలని విద్యశాఖ మంత్రికి సూచించారు. దీంతో మరోసారి విద్యాసంస్థలు మూతపడనున్నాయి. ఈ సమీక్షకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, ఒమిక్రాన్‌ వ్యాప్తి తదితర అంశాలపైనా సీఎం సమీక్షించారు.