Telugu News

ఏన్కూరు లో హోం ఓటింగ్ ప్రారంభం

0

ఏన్కూరు లో హోం ఓటింగ్ ప్రారంభం

ఏన్కూరు మే 3(విజయం న్యూస్):
మండలంలోని పలుచోట్ల శుక్రవారం హోం ఓటింగ్ కార్యక్రమం ప్రారంభమైంది.85 సంవత్సరాల వయసు పైబడిన వృద్ధులు,50 శాతం పైబడిన అంగవైకల్యం కలిగిన వారికి ఇంటి నుంచి ఓటు వేసే అవకాశాన్ని భారత ఎన్నికల సంఘం అధికారులు కల్పించారు.దీంతో మండలంలో 26 మందిని గుర్తించారు. వీరంతా ఇంటి నుంచి ఓటు వేయనున్నారు.ఈ కార్యక్రమంలో సిహెచ్ శేషగిరిరావు,ఎండిఓ ఎస్ రమేష్,సెక్టార్ అధికారులు నరసింహారావు,శ్రీనివాసరావు, ప్రవీణ్, పంచాయతీ సెక్రెటరీలు పాల్గొన్నారు.ఈ కార్యక్రమం గార్లఓడ్డు,జన్నారం ,నూకలంపాడు,ఏనుకూరులో జరిగింది.

ఇది కూడా చదవండి:- ఏన్కూరులో ఆగని మాజీ సీఎం కేసిఆర్