అర్హులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి
టీయూడబ్లూజే జిల్లా అధ్యక్షుడు అకుతోట ఆదినారాయణ
(ఖమ్మం-విజయం న్యూస్);-
ఖమ్మం జర్నలిస్టుల ఇళ్లు, ఇళ్ల స్థలాల సమస్యను తొందరలోనే సాకారం చేస్తానని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఇచ్చిన హామీని స్వాగతిస్తున్నామని టీయూడబ్ల్యూజే (టీజేఎఫ్) జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆకుతోట ఆదినారాయణ, సయ్యద్ ఇస్మాయిల్ అన్నారు. మంత్రి సంకల్పించిన విధంగా అర్హత ఉన్న ప్రతి జర్నలిస్టుకు న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. సోమవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో నగర జర్నలిస్టుల సమావేశం జరిగింది.
also readవైస్సార్ విగ్రహాన్ని అవమాన పరిచిన అధికార పార్టీ నేతలు :-
ఈ సమావేశంలో ఆదినారాయణ, ఇస్మాయిల్ మాట్లాడుతూ.. ఖమ్మం జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్య దశాబ్ద కాలంగా పెండింగ్ లో ఉందని, ఈ సమస్య పరిష్కారానికి సంకల్పం తీసుకున్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను సమావేశం అభినందించింది. నగరంలో అర్హులైన పేదలకు ఇంటి పట్టాలు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అందజేసిన విధంగానే జర్నలిస్టులకు కూడా న్యాయం చేయాలని కోరారు. అనంతరం ఇటీవల జరిగిన జర్నలిస్టుల శిక్షణా తరగతులకు హాజరైన ప్రతినిధులకు మీడియా అకాడమీ రూపొందించిన బుక్ లెట్స్, సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు గుద్దేటి రమేష్, రాజేంద్ర ప్రసాద్, సంతోష్, రాంబాబు, చక్రవర్తి, యూసుఫ్ షరీఫ్, గోపి, సాయి, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.