Telugu News

జనవరి 10 వరకు సభలు, సమావేశాలు, ర్యాలీలు లేవు- మహుబూబాబాద్ ఎస్పీ

మాస్క్ ధరించకుంటే విపత్తు నిర్వహణ చట్టం కింద 1000/- రూపాయల జరిమాన : మహబూబాబాద్ జిల్లాఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్

0

జనవరి 10 వరకు సభలు, సమావేశాలు, ర్యాలీలు లేవు- మహుబూబాబాద్ ఎస్పీ

మాస్క్ ధరించకుంటే విపత్తు నిర్వహణ చట్టం కింద 1000/- రూపాయల జరిమాన : మహబూబాబాద్ జిల్లాఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్

(మహబూబాబాద్- విజయం న్యూస్)
రాష్ట్రంలో కరోన కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వైరస్ కేసులు నమోదు అవుతున్నందున రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మహబూబాబాద్ జిల్లా పరిదిలో ప్రజలందరూ మాస్కులు తప్పకుండా ధరించాలని, మరియు కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వైరస్ థర్డ్ వేవ్ క్రమంలో దేశంలో మరియు రాష్ట్రంలో కేసులు నమోదు అవుతున్నాయని, మాస్కు ధరించకుండా ఎవరైనా రోడ్లపై తిరిగితే విపత్తు నిర్వహణ చట్టం కింద చర్యలు తీసుకునేందుకు పోలీస్ అధికారులకు ఆదేశాలు జారిచేసినట్లు చెప్పారు. కరోనా థర్డ్ వేవ్ ప్రభావాన్ని తగ్గించడం లక్ష్యంగా తీసుకుంటున్న చర్యలకు ప్రజలంతా సహకరించాలని సూచించారు.

also read :-హాస్టళ్లలో అరకొర తిండి ..పిల్లల్లో పెరుగుతున్న పౌష్టికాహార లోపం

జనవరి 10 వరకు సభలు, సమావేశాలు ర్యాలీలు నిషేధించడం జరిగిందన్నారు. మరియు గుంపులుగా ఉండకుండా భౌతిక దూరం పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కోవిడ్-19 నిబంధనలను అనుసరించి ఇంటి నుండి బయటకు వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలని సూచించారు. కరోనా థర్డ్ వేవ్ డిఫరెంట్ వైవిధ్యాలులో ఉండి చాలా స్పీడ్ గా వ్యాపిస్తుందని కావున ఒమిక్రాన్ నిర్ములనకు పోలీస్ అధికారుల సూచనలు సలహాలు పాటించి ప్రజలందరూ సహకరించాలని సూచించారు. మాస్కులు లేకుండా కొవిడ్-19 నిబంధనలు పాటించని వారిపై విపత్తు నిర్వహణా చట్టంలోని 51 నుంచి 60 సెక్షన్లు 188 ఐపీసి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ శరత్ చంద్ర పవార్ సూచించారు.