Telugu News

అర్హులైన పేదలందరికీ ఇండ్ల పట్టాలు – మంత్రి పువ్వాడ

నగరం 2,3,4&8వ డివిజన్లో 45 మందికి, 9వ డివిజన్లో 122 మందికి మొత్తం 167 మంది పట్టాలు పంపిణీ చేసిన మంత్రి పువ్వాడ.

0

అర్హులైన పేదలందరికీ ఇండ్ల పట్టాలు – మంత్రి పువ్వాడ

== నగరం 2,3,4&8వ డివిజన్లో 45 మందికి, 9వ డివిజన్లో 122 మందికి మొత్తం 167 మంది పట్టాలు పంపిణీ చేసిన మంత్రి పువ్వాడ.

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

అర్హులైనా ప్రతి పేదవారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో నెంబర్ 58,59 ద్వారా ఇళ్ళ పట్టాలను పంపిణీ చేయడం జరుగుతుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ అన్నారు. ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఉంటున్న పేదలకు అక్కడే లబ్ధిదారులకు వారి పేరు మీదనే పట్టాలు ఇవ్వడం చారిత్రాత్మకమన్నరు. ఖమ్మం నగరం 2,3,4 & 8వ డివిజనన్ లో 45 మందికి, 9వ డివిజన్ శ్రీ లక్ష్మినగర్ లో 122 మందికి మొత్తం 167 మంది పేద కుటుంబాలకు జి.ఓనెం.58,59 పట్టాలను మంత్రి పువ్వాడ పంపిణీ చేశారు.

ఇది కూడా చదవండి: కుట్టు మిషన్‌లు పంపిణీ చేసిన మంత్రి పువ్వాడ.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు మేలు చేసేందుకు తీసుకొచ్చిన జి.ఓనెం.58, 59 పథకం క్రింద ఖమ్మం నగరంలో ప్రభుత్వ స్థలంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న నివాసాలకు వారికి పూర్తి హక్కు కల్పించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఖమ్మం లోనే మొదటిగా జి.ఓనెం. 58, 59 పథకం క్రింద పెద్ద ఎత్తున పట్టాలు సిద్దం చేసి మునుపెన్నడూ లేని విధంగా ఈ పథకం ద్వారా శాశ్వత ఇళ్ళ పట్టాలు పంపిణీ చేస్తున్నామని అన్నారు. మీ పిల్లల భవిష్యత్ కోసం ప్రభుత్వం మీకు ఇస్తున్న అస్తి ఇది.. మీ ఇంట్లో మీరు నిర్భయంగా బ్రతకొచ్చు. మీ కల మీ కోరిక ముఖ్యమంత్రి కేసీఅర్ గారు నెరవేర్చారు అని అన్నారు. ఇప్పటికే అధికారులకు తగు ఆదేశాలు ఇవ్వడమైందని పేదలు ధరకాస్తు చేసుకున్న వారికి కనీస అర్హతగా ఎలాంటి గుర్తింపు కార్డు ఉన్నా వాటికి మంజూరు చేయాలని చెప్పామని అన్నారు. పేదలకు పూర్తి స్థాయిలో న్యాయం జరగాలనే ఉద్దేశంలో మంత్రుల విజ్ఞప్తి మేరకు మే 31వ తేదీ వరకు ఈ అవకాశాన్ని ముఖ్యమంత్రి కేసీఅర్ పెంచారని, ఇంకా దరఖాస్తు చేసుకోవాల్సిన వారు ఉంటే ఇప్పుడే ధరకాస్తు చేసుకోవాలని కోరారు.  కనీస ఆధారం ఉండి ఉన్న ప్రతి ఒక్కరికీ పట్టాలు అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఖమ్మం నగరంలోనే నిర్మించిన 2500 మందికి ఈ పథకం ద్వారా పట్టాలు ఇవ్వగలిగామని పేర్కొన్నారు.

ఇదికూడా చదవండి: మొక్కజొన్న, ధాన్యం సేకరణ పూర్తి చేయాలి: మంత్రి పువ్వాడ

సొంత స్థలం కలిగిన వారికి రూ.3 లక్షలు ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం తరుపున అందిస్తామని అన్నారు. పేదల పట్ల ప్రభుత్వం ఎంతో చిత్తుశుద్దితో వ్యవహరిస్తున్నదని మంత్రి అన్నారు.  మనకు ఇంతటి మహత్తర అవకాశం కల్పించిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, కేసీఅర్ ని మళ్ళీ గెలిపించుకోవాలని తద్వారా ఇలాంటి అనేక పథకాలు మీ కోసం తెస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్‌ పునుకొల్లు నీరజ, డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం, సుడా చైర్మన్‌ విజయ్‌ కుమార్‌,ఏఎంసీ చైర్మన్ శ్వేత,ఆర్డీవో రవీంద్రనాథ్,  తహసిల్దార్‌ శైలజ, కార్పొరేటర్లు జాన్ భీ, దందా జ్యోతి రెడ్డి, నాయకులు ఇస్సాక్, భూక్యా బాషా, నాగుల్ మీరా, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.