దళితులను ఇంకెంత కాలం మోసం చేస్తారు ?: సంభాని
== కోరి తెచ్చుకున్న తెలంగాణలో కోటి సమస్యలు
== ప్రభుత్వంపై మండిపడిన మాజీమంత్రి సంభాని చంద్రశేఖర్
== కల్లూరులో ముమ్మరంగా హత్ సే హత్ జోడో యాత్ర
(ఖమ్మంప్రతినిధి/కల్లూరు,సత్తుపల్లి-విజయంన్యూస్)
సత్తుపల్లి నియోజకవర్గంలో 37వ రోజు హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా శనివారం కల్లూరు మండలంలోని చండ్రుపట్ల, రఘునాథబంజర, నారాయణపురం గ్రామాల్లో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, అభివృద్ధి ప్రధాత ఏఐసిసి సభ్యులు, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు సంభాని చంద్రశేఖర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ చేసి ఇంటి ఇంటికి తిరుగుతూ.. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ది సాధ్యమని రాహుల్ గాంధీ సందేశాన్ని మరియు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలపై రూపొందించిన చార్జిషీట్ ని ప్రజలకు అందించారు.
ఇది కూడా చదవండి: కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతు పంటకు గిట్టుబాటు ధర: సంభాని
ముఖ్యమంత్రి కేసిఆర్ అధికారం కోసం ప్రజలకు ఇచ్చిన ఇంటి నిర్మాణానికి 3లక్షల రూపాయలు హామీ, గొర్రెల పంపిణీ పథకం, పోడుభూమి పట్టాలు, దళితబంధు పథకం, రైతు రుణమాఫీ హామీలపై నిలదీస్తూ ప్రజలను ఇంకెంతకాలం మీ గారడీ మాటలతో మోసం చేస్తారని, ఇకపై మీ బూటకపు మాటలు నమ్మే స్థితిలో ప్రజలు లేరని తెలిపారు. దళిత బంధు పథకంలో రాష్ట్రంలోని కొంతమంది ఎమ్మెల్యేలు రూ.3లక్షలు దాకా వసూలు చేశారని రాష్ట్ర సీఎం చెప్పడం ప్రభుత్వ అవినీతికి అద్దం పడుతోందని ప్రజలు దీనిని గమనించాలని కోరారు. రాష్ట్రంలో వరి కోతల కోసి పది రోజులవుతున్న కొనే దిక్కు లేకపోవడం విచారకరమని, అకాలవర్షాలతో నష్టపోయిన పంటకు, తడిసిన ధాన్యానికి ప్రభుత్వం తక్షణమే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి అమిత్ షా ముస్లిం రిజర్వేషన్ల రద్దు చేస్తామని వ్యాఖ్యలతో మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి మతతత్వ రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: అకాల వర్షానికి నష్టపోయిన రైతులను ఆదుకోవాలి: కాంగ్రెస్
రాష్ట్రంలో BRS పార్టీ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతూ వారి భవిష్యత్ ని అంధకారం చేస్తున్నదని, రాబోయే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలను సాగనంపి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో కల్లూరు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పెద్దబోయిన దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్టేట్ ఎస్సీసెల్ కన్వీనర్ కొండూరు కిరణ్, అంకిరెడ్డి సుధీర్ రెడ్డి, మండల ఉపాద్యక్షులు కీసర శ్రీనివాస రెడ్డి, మాజీ ఎంపిటిసి కృష్ణారెడ్డి, పడిగల రమేష్,తోట జనార్దన్ పోతురాజు రాము, కుక్కా సాంబయ్య, బండి సూర్యనారాయణ, శీలం వెంకటరెడ్డి, రావుల సీతయ్య, బండి శ్రీను, కుక్కా అంజయ్య, వైకుంఠ బాబురావు, ఆళ్ళ వెంకటేశ్వరరావు, వల్లభనేని బాబురావు, కాటమనేని కృష్ణారావు, పరిగడుపు బాబురావు, రాయి నాగేశ్వరరావు, ఇనపనూరి ముత్తయ్య, ఆముదాల శ్రీను, కల్లేపల్లి రమేష్, ఆఫ్రోజ్, సమీర్ తదితరులు పాల్గొన్నారు.