Telugu News

నిర్భందాలతో ఎంతమందిని ఆపగలరు: పువ్వాళ్ల

జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్

0

నిర్భందాలతో ఎంతమందిని ఆపగలరు: పువ్వాళ్ల

== ప్రతి పక్షాల గొంతు నొక్కుతున్నారు

== జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్

 (ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

హౌస్ అరెస్ట్ లు పేరుతో ప్రభుత్వం ప్రతి పక్షాలను గొంతు ఎత్తకుండా చేయడం అప్రజాస్వామికమని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్ గారు మండిపడ్డారు. శనివారం మంత్రి కెటిఆర్ పర్యటన నేపథ్యంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్ ను పోలీస్ లు హౌస్ అరెస్ట్ చేసి నిర్బంధించారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కేటీఆర్ జిల్లా పర్యటన కు ఎలా వస్తావాని ప్రశ్నించినందుకు అరెస్ట్ లు చేస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ హంగు ఆర్భాటాలతో ప్రజలను మళ్ళీ మోసం చేసేందుకు దేశ దిమ్మరిల తిరుగుతున్నారని ఎద్దేవ చేశారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ముందు వాటిని అమలు చేసి కొత్త హామీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధికార అహంతో అణచివేస్తే ప్రజలు మిమ్మల్ని అణచి వేస్తారని హెచ్చరించారు. నిజంగా అభివృద్ధి జరిగి ఉంటే హౌస్ అరెస్ట్ లు ఎందుకు అని ప్రశ్నించారు. అరెస్ట్ చేసిన కాంగ్రెస్ నాయకులను బేషరుతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి: ప్రతి పక్షాల గొంతు నొక్కుతున్నారు: జావిద్