Telugu News

రోజంతా పంచుడే..పంచుడు..వామ్మో ఎన్ని పైసలో..?

వినాయక విగ్రహాలకు అర్థిక చేయూత

0

రోజంతా పంచుడే..పంచుడు..వామ్మో ఎన్ని పైసలో..?

== వినాయక విగ్రహాలకు అర్థిక చేయూత

== బీఆర్ఎస్ నేతలు రూ10వేలు.. కాంగ్రెస్ నేతలు రూ.5వేలు

== భక్తి పేరుతో ఎన్నికల ప్రచారం

(కూసుమంచి-విజయంన్యూస్)

వినాయక విగ్రహాల వద్ద జరిగే అన్నదాన కార్యక్రమాలకు ప్రజలు, నాయకులు అర్థిక చేయూతనందించడం సర్వసాధాహరణ విషయమే.. కానీ వినాయక విగ్రహాల పేరుతో రాజకీయ ప్రచారం చేసుకోవడం ప్రస్తుతం రాజకీయ ట్రెండ్ గా మారిపోయింది.. అతి కొద్ది నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయా పార్టీల నాయకులు రాజకీయ ప్రచారాన్ని ప్రారంభించారు.. ఇంతలో వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభం కావడంతో శుభసూచకమని భావిస్తున్న రాజకీయ నాయకులు, అభ్యర్థులు, ఆశావాహులు వినాయక చవితి పూజల పేరుతో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు.. ప్రతి గ్రామానికి వెళ్లి, చిన్న, పెద్ద విగ్రహాలంటూ తేడా లేకుండా  ఒకే తరహాలో డబ్బులు పంచుతూ భక్తి భావం పేరుతో ముక్తిభావం పొందుతున్నారు..వినాయక చవితి వేడుకలను అసరాగా చేసుకుంటున్న ఎమ్మెల్యేలు, ఆశావాహులు వినాయక విగ్రహాల వద్దకు వెళ్లి భక్తులను, ప్రజలను కలిసి పైసలు పంచుతున్నారు.. ప్రస్తుతం వినాయక విగ్రహాలకు చేయూత అని చెప్పుకుంటున్నప్పటికి రాజకీయ ఎన్నికలకు ఓట్ల బాణంగా చెప్పుకోవాల్సి వస్తుంది.. గ్రామాల్లో పర్యటిస్తున్న నేతలకు ఆయా పార్టీల నాయకులు భారీగా స్వాగతం పలకడం, టపాసులు కాల్చడం, మోటర్ సైకిల్ ర్యాలీలు నిర్వహించడం,

ఇది కూడా చదవండి: ఖమ్మంలో నేడు వినాయక నిమజ్జనం

రాజకీయ నినాదాలు చేయడం చూస్తుంటే పాలేరు నియోజకవర్గంలో ఎన్నికల స్టంట్ ప్రారంభమైనట్లుగా కనిపిస్తోంది.. ఢీ అంటే ఢీ అన్నట్లుగా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పార్టీల నాయకులు, ఆశావాహులు, అభ్యర్థులు పోటాపోటీగా వినాయక విగ్రహాల వద్ద పంపిణి చేస్తున్నారు. పాలేరు నియోజకవర్గంలో జరుగుతున్న తంతును చూసి ఇతర నియోజకవర్గాలకు చెందిన ఆశావాహులు, రాజకీయ నాయకులు ముక్కున వేలేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.. ఇది రాజకీయ వినాశనానికి నాంధీ అంటూ  రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

== పంచుడే పంచుడు

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం ముమ్మరంగా ప్రారంభమైంది.. వినాయక చవితి సందర్భంగా ఆయా పార్టీలకు చెందిన నాయకులు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. బీఆర్ఎస్ పార్టీ పాలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కందాళ ఉపేందర్ రెడ్డి వినాయక విగ్రహాలకు డబ్బులు పంపిణి చేస్తున్నారు. ప్రతి విగ్రహానికి రూ.10వేల చొప్పున పంపిణి చేశారు. నియోజకవర్గంలో మొత్తం 1200 వినాయక విగ్రహాలకు ఒక్కోక్క విగ్రహానికి రూ.10వేల చొప్పున రూ.1.20కోట్ల డబ్బులను పంపిణి చేశారు. ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి, ఆయన సతిమణి, ఆయన కుమార్తేలు ఇద్దరు ఒక్కోక్క మండలాన్ని వెంచుకుని ప్రతి గ్రామంలో తిరుగుతూ వినాయక మండపాల వద్దకు వెళ్లి పూజలు చేసి, రూ.10వేలను అందజేస్తున్నారు.

ఇది కూడా చదవండి: ఖమ్మం లో ట్రాఫిక్  ఆంక్షలు

అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ఎంపీ, ఎన్నికల ప్రచార కమిటీ  కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ప్రతి విగ్రహానికి రూ.5016 లను అందిస్తున్నారు. వారు కూడా ప్రతి మండలానికి ఓ ఇంచార్జ్ ను నియమించగా, వారు ఆయా మండలాల్లోని గ్రామాల్లో తిరుగుతు ప్రతి విగ్రహ మండపం వద్దకు వెళ్లి పూజలు చేస్తున్నారు. ప్రతి విగ్రహానికి రూ.5016లను అందిస్తున్నారు. అలాగే పాలేరు నియోజకవర్గ పీసీసీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ ఆశావాహి రాయల నాగేశ్వరరావు అన్నదానాల నిమిత్తం వినాయక విగ్రహాల వద్దకు వెళ్లి పూజలు చేసి రూ.5016లను అందిస్తున్నారు. టీపీసీసీ అధికార ప్రతినిధి, డాక్టర్ మద్ది శ్రీనివాస్ రెడ్డి నియోజకవర్గంలోని కొన్ని వినాయక విగ్రహాలకు రూ.3016 చొప్పున అర్థిక చేయూతనందించారు. యంగ్ లీడర్, నియోజకవర్గ కాంగ్రెస్ టిక్కెట్ ఆశావాహి రాంరెడ్డి చరణ్ రెడ్డి వినాయక విగ్రహాల వద్ద అన్నదానాలకు రూ.5016 చొప్పున వితరణ చేశారు. ఒక వైపు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాయల నాగేశ్వరావు, రాంరెడ్డి చరణ్ రెడ్డి, మద్ది శ్రీనివాస్ రెడ్డిలు కాంగ్రెస్ పార్టీ తరుపున పంపిణి చేస్తుండగా, మరో వైపు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి డబ్బులు ఇస్తుండటంతో గణేష్ భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వారికి ఏడాది రూపాయ ఖర్చు తగలకుండా వినాయక పూజలు చేస్తున్నట్లు భక్తులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: వచ్చే సాధారణ  ఎన్నికలకు ఏర్పాట్లు వేగంచేయాలి: కలెక్టర్

అయితే ఎన్నికల సమయంలో వినాయక చవితి వేడుకలను ఆసరాగా చేసుకుని డబ్బులు పంపిణి చేయడం, , ప్రతి ఇంటికి తిరగడం, ప్రతి మండపం వద్దకు తిరగడం ఓటర్లను అకట్టుకునే ప్రయత్నం చేయడం భక్తి పేరుతో ముక్తి కల్గి పనులు చేస్తున్నారని ప్రజలు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఎన్నికలు వస్తున్నాయని ప్రజలను అకట్టుకునేందుకు విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేస్తుంటే భవిష్యత్ రాజకీయం ప్రమాదంలోకి వెళ్తున్నట్లు, సామాన్యుడు, ప్రజలు పోటీ చేసే అవకాశం ఉండకుండా కార్పోరేట్ శక్తులు మాత్రమే పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.