Telugu News

ఖమ్మం లో పోలీస్ తనిఖీల్లో భారీగా నగదు పట్టివేత

ఖమ్మం రూరల్ లో రూ.42.86లక్షలు, కల్లూరులో రూ.1.65లక్షలు పట్టివేత

0
ఖమ్మం లో పోలీస్ తనిఖీల్లో భారీగా నగదు పట్టివేత
== ఖమ్మం రూరల్ లో రూ.42.86లక్షలు, కల్లూరులో రూ.1.65లక్షలు పట్టివేత
== ఏలాంటి బిల్లులు లేకపోవడంతో ఇన్ కమ్ టాక్స్ అధికారులకు సమాచారం ఇచ్చిన పోలీసులు*
(ఖమ్మం ప్రతినిధి -విజయం న్యూస్)
ఖమ్మం రూరల్‌ పరిధిలోని వెంకటగిరి క్రాస్ రోడ్‌ వద్ద  పోలీసులు నిర్వహిస్తున్న వాహనాల తనిఖీలో ఏలాంటి పత్రాలు/ బిల్లులు లేకుండా ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న రూ.42.86,290 లక్షల రూపాయలు సీజ్ చేసి ఆదాయపు పన్ను శాఖ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు.  లోకసభ సాదారణ ఎన్నికల నేపథ్యంలో కమిషనరేట్ పరిధిలో తనిఖీలు  ముమ్మరం చేయడం జరుగుతుందని , అందులో భాగంగా ఈరోజు వెంకటగిరి క్రాస్ రోడ్‌ వద్ద సిఐ అంజలి తమ సిబ్బందితో నిర్వహిస్తున్న తనిఖీలో  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా , సూజతనగర్ మండలానికి చెందిన ఓ వ్యక్తి  మిర్యాలగూడ నుండి మణుగూరు వెళ్తున్న ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సులో ఎన్నికల నియమావళి విరుద్ధంగా
బిల్లులు లేకుండా నగదుతో ప్రయాణిస్తుండగా గుర్తించి
నగదు సీజ్ చేయడం జరిగిందన్నారు.
అదేవిధంగా కల్లూరులోని పెరువంచ అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టు వద్ద మోహరించిన పోలీసు మరియు SST బృందంతో నిర్వహిస్తున్న తనిఖీలలో
ఓ వ్యక్తి ఎలాంటి రశీదులు లేకుండా తిరువూరు మండలం మునుకుళ్ల గ్రామం నుండి ఖమ్మం రూరల్ పెద్దతండా తీసుకెళ్తన్న రూ.1,65,000 నగదు సీజ్ చేసినట్లు తెలిపారు.
నిబంధనలకు విరుద్ధంగా
సరైన ఆధారాలు చూపించకుండా తరలించే నగదు,నగలు, ఇతరత్రా సొత్తును సీజ్‌ చేసి, సంబంధిత అధికారులకు అప్పగిస్తారని తెలిపారు. ఎన్నికల నిబంధనల మేరకు రూ. 50 వేలకు మించి నగదు తీసుకువెళ్లరాదని, పెద్ద మొత్తంలో నగదు, ఆభరణాలు ఉంటే తప్పనిసరిగా వెంట సంబంధిత పత్రాలు ఉండాలని సూచించారు.