Telugu News

ఖమ్మం జిల్లాలో భారీగా దరఖాస్తులు…122 దుకాణాలకు 6213 దరాకాస్తులు.

ప్రభుత్వానికి రూ.124.26 కోట్ల ఆధాయం.

0

ఖమ్మం జిల్లాలో భారీగా దరఖాస్తులు

122 దుకాణాలకు 6213 దరాకాస్తులు

ప్రభుత్వానికి రూ.124.26కోట్ల ఆధాయం

(ఖమ్మం ప్రతినిధి – విజయంన్యూస్):-

ఖమ్మం జిల్లాలో భారీగా మద్యం దుకాణాలకు దరఖాస్తులు వచ్చాయి.. ఖమ్మం జిల్లాలో మొత్తం 122 దుకాణాలు ఉండగా వాటికి మొత్తం 6213 దరకాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఆంధ్ర సరిహద్దు ప్రాంతమైన సత్తుపల్లి, మధిర సర్కిల్ పరధిలో భారీగా ధరాకస్తులు వచ్చినట్లు కనిపిస్తోంది.ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో భారీగా మధ్యం ధరలు భారీగా పెంచడంతో ఆ ప్రాంతానికి చెందిన ప్రజలు తెలంగాణకు వచ్చి మద్యం తాగిపోతున్నారు. అలాగే అక్రమ రవాణా భారీగా జరుగుతుంది. ఈ కోణంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలోని వైన్స్ దుకాణాలకు భారీగా స్పందన వచ్చినట్లు కనిపిస్తోంది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 6213 దరఖాస్తులు వస్తే సత్తుపల్లి సర్కిల్లో 23 దుకాణాలకు 1318 దరఖాస్తులు రాగా, మధిరలో 20 దుకాణాలకు 1286 దరఖాస్తులు రావడమంటే సాధాహరణమైన విషయం కాదు. అయితే ఇంత పెద్దమొత్తంలో వచ్చిన ధరఖాస్తులకు తెలంగాణ ప్రభుత్వానికి భారీగానే ఆధాయం వచ్చింది. మొత్తం 122 దుకాణాలకు 6213 దరకాస్తులు రాగా ఒక్కోక్క ధరకాస్తుకు రూ.2లక్షలు చెల్లించడంతో మొత్తం రూ.124,26,00,000 వచ్చినట్లు తెలుస్తోంది.  తెలంగాణ ప్రభుత్వం మద్యం పాలసీపై భారీ ఆధాయం సంపాధించిందనే చెప్పాలి.

మద్యం దుకాణాలకు దరాకాస్తులు ఇలా

ఖమ్మం-1     24      1181

ఖమ్మం-2     17      731

నేలకొండపల్లి 15   746

వైరా             13      608

మధిర         20      1286

సత్తుపల్లి     23       1318

సింగరేణి     10        343

మొత్తం      122      6213

ALLSO RED:- కేంద్రంపై యుద్దానికి సిద్దం.

 

also read :- తిరుమలలో భారీ వర్షం.. కనుమదారులు మూసివేత.