ఖమ్మంలో కాంగ్రెస్ బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు
== మూడు లక్షల మందితో బహిరంగ సభ
== హాజరుకానున్న రాహుల్ గాంధీ, నలుగురు సీఎంలు, జాతీయ స్థాయి నాయకులు
== సభాస్థలాలను పరిశీలించిన కాంగ్రెస్ నేతలు
(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు ప్రజలు బ్రమ్మరథం పడుతున్నారని,ఆ పాదయాత్ర ఈ నెల 28న ఖమ్మం జిల్లాకు చేరుకుంటుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి సంభానీ చంద్ర శేఖర్ అన్నారు.ఖమ్మం జిల్లా కాంగ్రేస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్, ఖమ్మం జిల్లా అధ్యక్షులు పువ్వాడ దుర్గాప్రసాద్, నగర పార్టీ అధ్యక్షులు జావిద్ ప్రతినిధి బృందం వచ్చే నెలలో ఖమ్మంలో జరిగే భారీ బహిరంగ సభ స్థలాలను పరిశీలించారు. ఎస్ఆర్ & బిజెయన్అర్ కాలేజ్, సర్దార్ పటేల్ స్టేడియం పరిశీలించారు.
ఇది కూడా చదవండి: పొంగులేటి కలుస్తారా..? కలిసిపోతారా..?
అనంతరం మీడియా సమావేశంలోవారు మాట్లాడుతూ అదిలాబాద్ జిల్లా బొద్ నియోజకవర్గంలో ప్రారంభమైన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర 15 జిల్లాలు ముగించుకుని ఈనెల 28 ఖమ్మం జిల్లాలోకి ప్రవేశిస్తుందని తెలిపారు. జులై 2న లేదా 4న పాదయాత్ర ముగింపు సభను ఖమ్మం నియోజకవర్గంలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.ఈ భారీ బహిరంగ సభను 3లక్షల మంది కార్యకర్తలతో నిర్వహించనున్నామని, ఈ సభ రాష్ర్టంలోనే తిరుగులేని శక్తిగా మారబోతుందని వారు ధీమా వ్యక్తం చేశారు. అందు కోసం మూడు స్థలాలను పరిశీలించామని, అందులో ఏదో ఒక స్థలాన్ని ఎంపిక చేసి మంగళవారం వేదికను ప్రకటిస్తామని తెలిపారు. ఈ సభను సక్సెస్ చేసేందుకు ప్రజలందరు తరలిరావలని కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఏఐసీసీ ఛీఫ్ రాహుల్ గాంధీ హాజరవుతారని, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని సెగ్మెంట్స్ నుండి సభకు భారీగా ప్రజలు హాజరు కాబోతున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, పాలేరు పీసిసి సభ్యులు రాయల నాగేశ్వర్ రావు, వైరా పీసీసీ సభ్యులు, ఎస్టీసెల్ జిల్లా అధ్యక్షులు మాలోత్ రాందాస్ నాయక్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు యడ్లపల్లి సంతోష్, జిల్లా మైనార్టీ అధ్యక్షులు సయ్యద్ ముజాహిధ్ హుసేన్, రాష్ట్ర ఎస్సీ సెల్ కన్వీనర్ కొండూరి కిరణ్,నాయకులు హఫీజుద్దీన్,పెండ్ర అంజయ్య, పెద్దబోయిన దుర్గాప్రసాద్,తోట జనార్దన్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి, దయాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: పేదల రాజ్యం రావాలంటే కాంగ్రెస్ గెలవాలి: భట్టి