ఖమ్మం జిల్లాలో రూ.12.40లక్షల భారీగా నగదు పట్టివేత
వైరాలో రూ.5లక్షలు, తల్లాడలో రూ.5లక్షలు, కొణిజర్లలో రూ.2.40లక్షలు పట్టివేత
ఖమ్మం జిల్లాలో రూ.12.40లక్షల భారీగా నగదు పట్టివేత
== వైరాలో రూ.5లక్షలు, తల్లాడలో రూ.5లక్షలు, కొణిజర్లలో రూ.2.40లక్షలు పట్టివేత
== ఏపీకి చెందిన నేత వద్ద కారులో నిల్వ ఉన్న నగదు పట్టివేత
== కోడ్ అమలైన గంటలోపే పోలీసుల తనిఖీలు
== ఎన్నికల కోడ్ అమలుతో పోలీసుల ముమ్మర తనిఖీలు
== మండల కేంద్రాల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేసిన పోలీసులు
(వైరా/ఖమ్మం-విజయంన్యూస్)
ఒక వైపు ఐదు రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల నగారా మోగించింది.. సోమవారం మధ్యాహ్నం 12గంటలకు విలేకర్ల సమావేశంలో ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంతో పాటు మరో నాలుగు రాష్ట్రాలకు ఎన్నికలను ప్రకటించగా షెడ్యూల్ విడుదలైన మరుక్షణమే ఎన్నిలక ప్రవర్తన నియమావళి అమల్లోకి వస్తుంది.. అయితే ఎన్నికల కోడ్ అమలైన గంటలోపే ఖమ్మం జిల్లాలో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టగా నమ్మలేని విధంగా భారీ నగదు దొరికింది. ఖమ్మం జిల్లాలో మొత్తం మూడు ప్రాంతాల్లో రూ.12.40లక్షల నగదును పోలీసులు పట్టుకున్నారు.
ఇది కూడా చదవండి: తెలంగాణలో నవంబర్ 30న పోలింగ్
వైరా నియోజకవర్గంలో కారులో నిల్వ ఉన్న రూ.5లక్షల నగదును స్థానిక పోలీసులు పట్టుకోగా, తల్లాడలో రూ.5లక్షలు, కొణిజర్లలో రూ.2.40లక్షలను పోలీసులు పట్టుకుని సీజ్ చేశారు. ఎన్నికల కోడ్ అమలు కావడంతో వైరాలోని మధిర క్రాస్ రోడ్డు సెంటర్ లో వైరా ఎస్సై మేడా ప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు చేపట్టగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమగోదావరి జిల్లా మాజీ చైర్మపర్సన్ ఇమ్మని రాజేశ్వరి కారులో రూ.5లక్షలు ఉండగా వైరా పోలీసులు పట్టుకున్నారు. పశ్చిమగోదావరి నుంచి హైదరాబాద్ కు వెళ్తున్న ఆమె కారును పోలీసులు పరిశీలించగా రూ.5లక్షల నగదు లభించింది. దీంతో పోలీసులు ఆ నగదుకు సంబంధించిన కాగితాలు ఏమి లేకపోవడంతో పోలీసులు సీజ్ చేశారు.
== టీడీపీ హాయంలో జడ్పీచైర్మన్ గా పనిచేసిన రాజేశ్వరరి
పశ్ఛిమగోదావరి జిల్లా, కోయిలగూడెం మండలం డిప్పు కాయలపల్లి గ్రామానికి చెందిన ఇమ్మని రాజేశ్వరి టీడీపీ తరుపున గత ప్రభుత్వం హాయంలో జడ్పీచైర్మన్ గా పనిచేశారు. పదవికాలం అనంతరం ఆమె ప్రస్తుతం హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారు. ఇటీవలే స్వగ్రామం వచ్చిన ఆమె తిరిగి ఇంటికి వెళ్తున్నారు. ఆ నగదును వ్యవసాయ పనుల నిమిత్తం బ్యాంకులోని తన లాకర్ లో ఉన్న నగదును తీసుకుని హైదరాబాద్ కు తీసుకెళ్తున్నట్లుగ ఆమె చెబుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఎన్నికల కోడ్ నిబంధనల ప్రకారం రూ.50వేల కంటే ఎక్కువ ఏ ఒక్కరి వద్ద ఉన్న వాటిని సీజ్ చేసే అవకాశం ఉంది. అందుకే పోలీసులు ఎలాంటి ఆధారాలు లేకుండా రూ.5లక్షలు తీసుకెళ్తున్న సందర్భంగా ఆమె నగదును సీజ్ చేసినట్లు ఎస్ఐ మేడా ప్రసాద్ తెలిపారు. అయితే ఎన్నికల కోడ్ వచ్చిన గంటలోపే తనిఖీలు చేసి రూ.5లక్షలను పట్టుకోవడంతో ఒక్కసారిగా రాజకీయ నాయకులు ఉలిక్కిపడినట్లైంది.
== జిల్లా వ్యాప్తంగా తనిఖీలు
రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. జిల్లా వ్యాప్తంగా పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. మండల కేంద్రాల్లో, నగరం, పట్టణాల్లో అత్యవసరంగా తనిఖీ కేంద్రాలను ఓపెన్ చేశారు. ప్రత్యేక టీమ్ లను ఏర్పాటు చేసి తనిఖీలు చేయిస్తున్నారు.
== తల్లాడలో రూ. 5 లక్షల నగదు పట్టివేత..
ఇది కూడా చదవండి: ఐదు రాష్ట్రాలకు మోగిన ఎన్నికల నగారా
ఖమ్మంజిల్లా తల్లాడలో రూ. 5 లక్షల రూపాయల నగదును తల్లాడ పోలీసులు పట్టుకున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో తల్లాడ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ పి. సురేష్ ఆధ్వర్యంలో తల్లాడ రింగ్ రోడ్డు సెంటర్లో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా ద్విచక్ర వాహనంపై ఓ వ్యక్తి ఐదు లక్షలు తీసుకెళ్తుండగా పట్టుబడ్డాడు. ఆ నగదుకు సంబంధించిన ఎటువంటి పత్రాలు లభించకపోవడంతో నగదును సీజ్ చేశారు. ఈ తనిఖీల్లో తల్లాడ పోలీస్ ఉన్నారు.
== కొణిజర్లలో రూ.2.40లక్షలు
కొణిజర్ల మండల కేంద్రంలో పోలీస్ చెక్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీలలో కారులో ఎలాంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న రెండు లక్షల నలభై వేల నగదును పోలీసులు పట్టుకున్నారు. కల్లూరు వైపు నుండి ఖమ్మం వెళ్తున్న కారు 2, లక్షల 40 వేల రూపాయల నగదును సీజ్ చేసిన పోలీసులు పట్టుకున్నారు.
== ఖమ్మంలో 15 కిలోల గంజాయి పట్టివేత
ఖమ్మం జిల్లాలో పోలీసులు ముమ్మర తనిఖీల్లో భాగంగా భారీగా గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఖమ్మం నగరంలోని ఎఫ్సీఐ గౌడౌన్ వద్ద ఎక్సైజ్ అధికారుల తనిఖీల్లో 15 కిలోల గంజాయి పట్టుకున్నారు. బీహార్ కు చెందిన వ్యక్తిపై కేసు నమోదు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విలువ సుమారు 4 లక్షలు ఉండొచ్చని ఎక్సైజ్ అధికారుల అంచనా వేస్తున్నారు.
ఇది కూడా చదవండి: కామ్రెడ్లతో కాంగ్రెస్ దోస్తి..బీఆర్ఎస్ తో కుస్తి