Telugu News

ఖమ్మం లో బీఆర్ఎస్ గెలుస్తుంది: నామా

ఖమ్మంలోని డివిజన్ నాయకులతో సమావేశం లో ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామా

0

ఖమ్మం లో బీఆర్ఎస్ గెలుస్తుంది: నామా

== ఖమ్మంలోని డివిజన్ నాయకులతో సమావేశం లో ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామా

(ఖమ్మం ప్రతినిధి -విజయం న్యూస్)
పార్లమెంటు ఎన్నికల్లో కేసిఆర్ ని బలపరిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి సంక్షేమ పథకాలు అమలు చేయించే బాధ్యత మన బీఆర్ఎస్ పార్టీ ఏ తీసుకుంటుందని ఖమ్మం పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు స్పష్టం చేశారు.ఖమ్మం కార్పొరేషన్ వన్ టౌన్ & 3 టౌన్ బిఆర్ఎస్ పార్టీ బూత్ లెవెల్ కమిటీ సభ్యులతో *ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ నందు నగర పార్టీ అధ్యక్షులు పగడాల నాగరాజు  అధ్యక్షతన జరిగిన సమావేశం జరిగింది.

ఇది కూడా చదవండి:- ఖమ్మం లో నాదే గెలుపు..: నామా

అభ్యర్థి నామా నాగేశ్వరరావు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ & ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాతా మధుసూదన్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా ప్రజలు చరిత్రను తిరగరాయనున్నారని తెలిపారు. ఖమ్మం నియోజవర్గంలోనే అత్యధిక మెజార్టీ రానుందన్నారు. బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకే ప్రజా ఆదరణ ఇప్పటికే సర్వే ఫలితాలు తేల్చాయి.నామా నాగేశ్వరరావు  విజయం కోసం ప్రతి బూత్ లెవల్ కమిటీ సభ్యుడు గడపగడపకు వెళ్లి ఓట్లను అభ్యర్థించాలన్నారు.అసెంబ్లీ ఎన్నికలు అయిన అతి తక్కువ కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం పై తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. ఖమ్మం జిల్లా ప్రయోజనాల కోసం తనదైన స్థాయిలో పార్లమెంట్ వేదికగా కృషిచేసిన మహోన్నతమైన వ్యక్తి మన నామా నాగేశ్వరరావు అని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు.

ఇది కూడా చదవండి:- నామ రైతు బిడ్డ..గెలిపించండి: రవిచంద్ర 

బూత్ కమిటీ సభ్యులకు డివిజన్ నాయకులకు, కార్యకర్తలకు బిఆర్ఎస్ పార్టీ విజయాన్ని కాంక్షిస్తూ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన వివిధ విషయాలను దిశా నిర్దేశం చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఖమ్మం నగర మేయర్ నీరజ, సీనియర్ నాయకులు ఆర్జేసు కృష్ణ, వన్ టౌన్ & 3 టౌన్ కార్పొరేటర్లు, ఇన్చార్జులు ‌మరియు డివిజన్ అధ్యక్షులు, కార్యదర్శులు, బూతులు కమిటీ సభ్యులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.