Telugu News

చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఏన్కూరులో భారీ ర్యాలీ 

0
చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఏన్కూరులో భారీ ర్యాలీ 
ఏన్కూరు, సెప్టెంబర్ 24(విజయం న్యూస్):
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు  అరెస్టుకు నిరసనగా ఆదివారం ఏన్కూరులో రాజకీయాలకు అతీతంగా నాయకులు,చంద్రబాబు అభిమానులు భారీ ర్యాలీ నిర్వహించారు. కమ్మవారి కల్యాణ మండపం నుండి తహసిల్దార్ కార్యాలయం, సాయిబాబా గుడి వరకు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం కొవ్వొత్తులతో మానవహారం చేశారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి సభ్యులు ధరావత్ రాంమ్మూర్తి నాయక్, వైరా నియోజకవర్గ నాయకురాలు బానోత్ విజయభాయి, జిల్లా నాయకులు గుత్త వెంకటేశ్వరరావు, ఎంపీపీ ఆరెం వరలక్ష్మి, ఎంపీటీసీ చీరాల కృష్ణవేణి, తెదేపా ఖమ్మం పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు ఆరెం రామయ్య, కమ్మ సంఘం మండల అధ్యక్షుడు తోట రాధాకృష్ణ, మాజీ జెడ్పిటిసి కోపెల శ్యామల, టిడిపి మండల అధ్యక్షుడు కొనకంచి రామకృష్ణ, నాయకులు కోపెల రామారావు, వక్కంతుల నాగార్జున, తాళ్లూరి అప్పారావు, జాగర్లమూడి రంజిత్ కుమార్, మాదినేని లెనిన్, సాయి తదితరులు పాల్గొన్నారు.