Telugu News

ఔటర్‌ రింగ్‌రోడ్డులో భారీకుంభకోణం: రేవంత్ రెడ్డి

30 ఏండ్ల లీజుకు కట్టబెట్టిన కెసిఆర్‌ ప్రభుత్వం

0

ఔటర్‌ రింగ్‌రోడ్డులో భారీకుంభకోణం: రేవంత్ రెడ్డి

== 30 ఏండ్ల లీజుకు కట్టబెట్టిన కెసిఆర్‌ ప్రభుత్వం

== 30వేల కోట్ల ఆదాయాన్ని 7380కే అప్పగింత

== టెండర్ల వెనక సోమేశ్‌, అర్వింద్‌ల హస్తం

== దీనిపై నోరు మెదపని కిషన్‌ రెడ్డి, బండి సంజయ్‌

== కాంగ్రెస అధికారంలోకి రాగానే విచారణ చేయిస్తాం

== మీడియా సమావేశంలో పిసిసి చీఫ్‌ రేవంత్‌ వెల్లడి

హైదరాబాద్‌,ఏప్రిల్‌29(విజయంన్యూస్):

ఔటర్‌ రింగ్‌ రోడ్డును లీజుకు ఇవ్వడం వెనుక భారీ కుంబకోణం జరిగిందని, సుమారు రూ.1000కోట్లకు పైగా అవినీతి జరిగిందని  పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. ఔటర్‌ రింగు రోడ్డును 30 ఏళ్ల  పాటు లీజుకిస్తే దాదాపు  30 వేల కోట్ల ఆదాయం వస్తదన్నారు. అయితే ముంబైకి చెందిన  ఐఆర్‌ బీ లిమిటెడ్‌ అనే సంస్థకు కేవలం  రూ.7380 కోట్లకే కేసీఆర్‌  తాకట్టు పెట్టారని ఆరోపించారు. నాలుగైదు నెలల్లో దిగిపోయే కేసీఆర్‌కు  ఔటర్‌ రింగ్‌ రోడ్డును అమ్మాల్సిన అవసరం  ఏముందని ప్రశ్నించారు.

ఇది కూడా చదవండి: బీహార్ లే తెలంగాణ ను నాశనం చేస్తున్నారు: రేవంత్ రెడ్డి

ఔటర్‌ రింగ్‌ రోడ్డు లీజులో దాదాపు 1000 కోట్లకుపైగా చేతులు మారినట్లు సమాచారం ఉందన్నారు. ఇది దేశంలోనే పెద్ద స్కాం అని.. దీని వెనకాల మాజీ  సీఎస్‌ సోమేష్‌ కుమార్‌, హెచ్‌ఎండీఏ కమిషనర్‌ అర్వింద్‌ కుమార్‌ ఉన్నారని ఆరోపించారు.  కేటీఆర్‌ తో కలిసి ఈ దోపిడికి పాల్పడ్డారన్నారు. సోమేశ్‌ కుమార్‌,అర్వింద్‌ కుమార్‌ ను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఈ ఇద్దరు అధికారులు తీసుకున్న నిర్ణయాలను.. లావాదేవీలపై అధికారంలోకి రాగానే  కాంగ్రెస్‌ సవిూక్షిస్తుందని అన్నారు. ప్రజల ఆస్తిని ప్రైవేట్‌ వ్యక్తులకు కట్టబెడితే బీజేపీ ఎందుకు స్పందించడం లేదన్నారు రేవంత్‌. ఔటర్‌ రింగ్‌ రోడ్డును కాపాడే బాధ్యత బీజేపీపైన  లేదా అని ప్రశ్నించారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు సంబంధించిన స్కాంపై తాము అధికారంలోకి రాగానే  విచారణ జరుపుతామన్నారు. దోపిడి కోసమే కేసీఆర్‌  ఔటర్‌ రింగ్‌ రోడ్డును ఐఆర్‌అండ్‌ బీ సంస్థకు  కేసీఆర్‌ కట్టబెట్టిండని ఆరోపించారు.  నాలుగైదు నెలల్లో గదదె దిగే కేసీఆర్‌ కు  ఔటర్‌ రింగ్‌ రోడ్డును  లీజుకు ఇవ్వాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డును లీజుకివ్వడాన్ని కాంగ్రెస్‌ వ్యతిరేకిస్తోందని.. ఈ ఒప్పందాలన్నింటిని కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే  సవిూక్షిస్తుందన్నారు. ఈ టెండర్ల వెనుక జరిగిన అవకతవకలపై అన్ని దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తామని వెల్లడిరచారు. సంస్థ యాజమానులు కూడా నూటికి నూరు శాతం జైలుకు వెళ్లడం ఖాయమని హెచ్చరించారు.  టోల్‌ను ఈగల్‌ ఇన్‌ఫ్రాకు కట్టబెట్టారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి విమర్శించారు.

ఇది కూడా చదవండి: దళితులను ఇంకెంత కాలం మోసం చేస్తారు ?: సంభాని

శనివారం గాంధీభవన్‌లో ఆయన విూడియాతో మాట్లాడుతూ ఓఆర్‌ఆర్‌ను ఆదాయవనరుగా కేటీఆర్‌ మిత్రబృందం ఉపయోగించుకుందని ఆరోపించారు. ఈ ఆదాయాన్ని శాశ్వతం చేసుకోవాలని కేటీఆర్‌ కుటుంబం ఆలోచనగా ఉందని ఆరోపించారు. ఔటర్‌ రింగ్‌ రోడ్‌ను మంత్రి కేటీఆర్‌ ప్రైవేట్‌కు తాకట్టు పెట్టారని, తమ కుటుంబానికి లాభం ఉండదని 30 ఏళ్ల పాటు.. ప్రైవేట్‌ సంస్థకు కట్టబెట్టాలని నిర్ణయం తీసుకున్నారని అన్నారు. పెట్టుబడులు అంటే నూతన ఇన్‌ఫ్రాస్టక్చర్ర్‌ ఏర్పాటు చేయాలని.. ఉన్నవాటిని తాకట్టు పెట్టడం కాదని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. 2004లో కాంగ్రెస్‌ అధికారం లోకి వచ్చాక రాష్ట్రంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించారని, హైదరాబాద్‌ మహా నగరానికి మణిహారంగా ఔటర్‌ రింగ్‌ రోడ్‌ను నిర్మించిందని రేవంత్‌ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ ప్రమాణాల తో ఔటర్‌ రింగ్‌ రోడ్డును కాంగ్రెస్‌ నిర్మించిందన్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెడుతున్నారంటే… విమానాశ్రయం, ఔటర్‌ రింగ్‌ రోడ్డే ప్రామాణికమని అన్నారు. వేల కోట్ల ఆదాయం వచ్చే రింగ్‌ రోడ్‌ను ప్రయివేటుకు అమ్మేశారని, పెట్టుబడులు అంటే నూతన ఇన్ఫా స్టక్చర్ర్‌ ఏర్పాటు చేయాలి కానీ ఉన్నవాటిని తాకట్టు పెట్టడం కాదని రేవంత్‌ వ్యాఖ్యానించారు. కనీసం రూ. 30 వేల కోట్లు ఆదాయం వచ్చే ఔటర్‌ను రూ. 7,380 కొట్లకే ముంబై కంపెనీకి తాకట్టు పెట్టారని రేవంత్‌ విమర్శించారు. దీని వెనక సోమేశ్‌ కుమార్‌ వ్యవహారం నడపగా.. అరవింద్‌ కుమార్‌ సంతకం పెట్టారన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక మొట్టమొదట వీటిపై విచారిస్తామన్నారు.

ఇది కూడా చదవండి: యుద్ధ ప్రాతిపదికన మార్క్ఫెడ్ లు ప్రారంభించాలి: పువ్వాళ్ల

దీనిపై బీజేపీ ఎందుకు మౌనంగా ఉందని ఆయన ప్రశ్నించారు. ప్రజల ఆస్తులు కేసీఆర్‌ అమ్ముతుంటే బండి సంజయ్‌, కిషన్‌ రెడ్డి ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. ప్రజలు ఔటర్‌ రింగ్‌ రోడ్‌ను వినియోగించే పరిస్థితులు లేవని, టెండర్‌ విధానాలపై విచారణ సంస్థలన్నింటికి పిర్యాదు చేస్తామని రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు.