Telugu News

ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిస్తేనే మానవ మునుగడ: సిద్దార్థ

వ్యాసరచన విజేతలుగా విశ్వశాంతి విద్యార్థులు..

0

ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిస్తేనే మానవ మునుగడ: సిద్దార్థ
== వ్యాసరచన విజేతలుగా విశ్వశాంతి విద్యార్థులు..

== *DFO సిద్ధార్థ విక్రమ్ సింగ్ 

(సత్తుపల్లి -విజయం న్యూస్)
– మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ న్యూఢిల్లీ వారి సహకారంతో ఈ నెల 22న వరల్డ్ ఎర్త్ డే ని పురస్కరించుకొని ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్ అంశంపై జిల్లాస్థాయిలో ఏర్పాటుచేసిన వ్యాసరచన పోటీలో సత్తుపల్లి కి చెందిన విశ్వశాంతి స్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు.
ప్రశాంతి విద్యార్థులు చవాన్ భార్గవి ప్రథమ స్థానం,
టీ. వైష్ణవి( తృతీయ స్థానం) నిలిచారు. లోహిత, కౌశల్ ప్రత్యేక సాధించారు.
మంగళవారం ఏర్పాటుచేసిన బహుమతులు పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జిల్లా అటవీశాఖ అధికారి సిద్ధార్థ విక్రమ్ సింగ్ (ఐఎఫ్ఎస్ )హాజరయ్యారు. భావితరాలకు మంచి భవిష్యత్తును అందించాలంటే ఇప్పటినుంచే మనం ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలని సిద్ధార్థ విక్రమ్ సింగ్ ఐఎఫ్ఎస్ పిలుపునిచ్చారు.
– యాక్షన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్(AID) సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎర్త్ డే కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థి స్థాయి నుండే మనం ప్రకృతి పట్ల, పర్యావరణం పట్ల అవగాహన పెంపొందించుకోవాలని అన్నారు. ఉన్న గ్రహాలన్నింటిలో ఒక్క భూగ్రహం మాత్రమే మానవ మనుగడకు అనుకూల పరిస్థితిలో ఉన్నాయని కానీ మన అవసరాలకు భూమిని, దాని యొక్క నిజస్వరూపాన్ని నాశనం చేస్తున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. భూమి పుట్టుక నాలుగున్నర కోట్ల సంవత్సరాల క్రితం జరిగిందని ఇదొక అద్భుత గ్రహం అని దీనిని అర్థం చేసుకొని జీవనం సాగిస్తే ప్రకృతి మనకు వర ప్రసాదంగా ఉంటుందని అభిలాషించారు. ప్రకృతిని మనం రక్షిస్తే ప్రకృతి మనల్ని రక్షిస్తుంది అని హితవు పలికారు. ఈ సందర్భంగా తాను చదువుకునే రోజుల్లో మొక్కలు నాటే కార్యక్రమం అవగాహన కార్యక్రమాలను గుర్తు చేసుకున్నారు . ఇప్పుడు అటవీశాఖ అధికారిగా తన వంతు బాధ్యతగా అడవులను, భూమిని దాని యొక్క సారాన్ని రక్షించడానికి నిరంతరం కృషి చేస్తూ క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులంతా ఇప్పటినుంచే మొక్కలు నాటడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, అవసరమైతే నిర్మూలించడం మరియు ఇతరులకు అవగాహన కల్పిస్తూ సమ్మిళిత అభివృద్ధికి పాటుపడాలని రాబోయే తరాలకు మంచి వాతావరణాన్ని, పర్యావరణాన్ని అందించిన వారం అవుతామని తెలిపారు.
– ఏఐడీ సంస్థ డైరెక్టర్ హరిప్రసాద్ మాట్లాడుతూ …
గాలి కాలుష్యం ,భూమి కాలుష్యం వలన రాబోయే తరాలకు త్రాగునీరు కూడా దొరకదని కావున అందరూ కలిసి ప్లాస్టిక్ను నివారించడానికి నడుంబించాలని పిలుపునిచ్చారు.
వ్యాసరచన పోటీలు విజేతలకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా మెమొంటో, ప్రశంసా పత్రం, శాలువాలను అందించారు. అనంతరం బాల బాలికలు ప్లాస్టిక్ భూతంపై నాటికలను ప్రదర్శింపజేసి అతిధులను ఆలోచింపజేశారు.

వ్యాసరచన పోటీ విజేతల వివరాలు:
ప్రథమ బహుమతి సిహెచ్ .భార్గవి (విశ్వశాంతి విద్యాలయం )సత్తుపల్లి.
ద్వితీయ బహుమతి బి .లికిత
(బేబీ మూన్ హై స్కూల్),
నందిత (హార్వెస్ట్ స్కూల్ ,ఖమ్మం), తృతీయ బహుమతి టీ. వైష్ణవి (విశ్వశాంతి హై స్కూల్, సత్తుపల్లి). జి . గ్రేస్( ప్రొద్దుటూరు ) టీ .తన్మయి (హార్వెస్ట్ స్కూల్ , ఖమ్మం).

– ఈ కార్యక్రమంలో ఏఐడీ సంస్థ డైరెక్టర్ వాణి, తాసిల్దార్ రామారావు, ఎఫ్ .ఆర్. వో. శ్రీనివాసరావు , ఎంఈఓ రామాచారి, బేబీ మూన్, విశ్వశాంతి విద్యాలయం, హార్వెస్ట్, మై స్కూల్ , విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు