Telugu News

ఈటెల ఘన ‘విజయం’

హెుజురాబాద్ లో  వికసించిన కమలం పువ్వు

0

అత్మ గౌరవానిదే ‘గెలుపు’

** హెుజురాబాద్ లో  వికసించిన కమలం పువ్వు

** భారీ మెజారిటీతో మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఘన విజయం

** రాష్ర్ట వ్యాప్తంగా సంబరాల్లో మునిగిన బీజేపీ శ్రేణులు

(కరీంనగర్ నుంచి ప్రత్యేకప్రతినిధి-విజయం న్యూస్)

హుజురాబాద్ ఎన్నికలు అత్మగౌరవానికి, అధికారానికి మధ్య జరిగినట్లు అనేక ధపాలుగా ప్రజలు చర్చించుకున్నారు.. విజయం అత్మగౌరవానిదా..? అధికారానిదా..? అంటూ లెక్కలేశారు.. నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచి హుజురాబాద్ అంటేనే దేశవ్యాప్తంగా ఓ చర్చాంశనీయమైంది.. ఎవరు గెలుస్తారు..? ఎవరుఓడతారనే దానిపైనే రసవత్తరంగా చర్చ జరిగింది.. పందేం రాయళ్లకు పండేగే పండగైంది.. కోట్లాధి రూపాయల బెట్టింగ్ జరిగింది.. మొత్తానికి అధికార పార్టీ అర్థిక దహార్తికి, అధికారంలో ఉండి ఆరోపణలను ఎదుర్కోని సవాల్ చేసి బరిలో నిలిచిన ఆత్మగౌరవానికి మధ్య హుజురాబాద్ లో ఎన్నికలు జరిగాయి.. కాదుకాదు.. ఎన్నికల యుద్దం జరిగింది.. ఈ యుద్దంలో ఆత్మగౌవరమే విజయం సాధించింది.. కోట్లాధి రూపాయలు పంపిణి చేసిన, అభివృద్ది పథకాలు కుమ్మరిచ్చిన ఆత్మగౌరవం కిందా అవేవి నిలబడలేదు.. హుజురాబాద్ ప్రజలు సైతం ఆత్మగౌరవానికే పెద్దపీట వేశారు.. అత్మీయుడ్ని అక్కున చేర్చుకున్నారు.. అందరివాడికే పట్టాభిషేకం చేశారు.. భారీ మెజారిటీతో మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ను గెలిపించారు. ఇప్పటి వరకు మొత్తం 21 రౌండ్లు పూర్తి కాగా 22వేలకు పైగా మెజారిటీ లభించింది. మరో 1 రౌండ్లు మాత్రమే మిగిలిపోగా మరింతగా మెజారిటీ పెరిగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.

అందరు అనుకున్నట్లుగానే జరిగింది.. హజురాబాద్ ఎన్నికల్లో మాజీ మంత్రి ఈటేల రాజేందర్ ఘన విజయం సాధించారు. అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ పై బీజేపీ పార్టీ అభ్యర్థి,  మాజీ మంత్రి ఈటేల రాజేందర్ అద్భుత విజయం సాధించారు. ఎవరు ఊహించని విధంగా అధికార పార్టీకి షాక్ ఇచ్చారు. అధికార పార్టీ పెద్ద ఎత్తున డబ్బులు, మధ్యం పంపిణి చేసినప్పటికి హుజురాబాద్ ప్రజలు మాజీ మంత్రి ఈటేల వైపే మొగ్గు చూపారు. మొత్తం 22 రౌండ్లలో ఒక్క రౌండ్ మినహా అన్ని రౌండ్లలో ఏకపక్షంగా ఫలితం వచ్చింది. అన్ని రౌండ్లలో బీజేపీ అభ్యర్థి మెజారిటీ రావడం జరిగింది. అధికార పార్టీ అభ్యర్థి స్వంత గ్రామంలో, ప్రభుత్వం దళితబంధు అమలు చేసిన గ్రామంలో కూడా ఈటేలకు భారీ మెజారిటీ వచ్చిందంటే ఆయన ఆ నియోజకవర్గంలో ఎంతగాను పనిచేశారో..? ఎంతగాను ప్రజలను అకట్టుకున్నారో..? అర్థమవుతుంది. ఈటేల రాజేందర్ అందరివాడు, ఆత్మీయుడు అంటూ పిలుస్తున్న జనం, ఆ ఆత్మాభిమానానికే ఓట్లేసి బారీ మెజారిటీతో గెలిపించారు. అధికార టీఆర్ఎస్ పార్టీకి మాత్రం ఇది పెద్ద చెప్ప పెట్టుగానే పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు.ఇక రసవత్తర పోరులో భారీ విజయం సాధించిన బీజేపీ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. రాష్ర్ట వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు సంబరాలు చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ మూడవ  స్థానంలో నిలిచింది. కనీసం డిపాజిట్ దక్కలేదు.

కాంగ్రెస్ సభ్యత్వం తీసుకుంటే రూ.2లక్షలు బీమా

*‘ఎప్పటికప్పుడు లెటెస్ట్ న్యూస్ కావాలనుకుంటున్నారా..? దేశంలో, రాష్ర్టంలో జరిగే తాజా బ్రేకింగ్ న్యూస్ కావాలనుకుంటున్నారా..? అయితే మా విజయం పేపర్ ను సబ్ స్కైబ్ చేసుకొండి.. మీ స్ర్కీన్ పై ఉన్న గంట గుర్తును నొక్కండి.. ఆ తరువాత ఎలో అని నొక్కండి.. మినిట్ టూ మినిట్ బ్రెకింగ్ న్యూస్ మీ ముంగిట’*🔔*