Telugu News

హుజురాబాద్ లో పదునెక్కుతున్న విమర్శల కత్తులు..!

- 'ధూంధాం'లతో టిఆర్ఎస్ లో కొత్త ఊపు

0

పదునెక్కుతున్న విమర్శల కత్తులు..!
– ‘ఈటెల’ నువ్వెంత అంటూ ఘాటైన వ్యాఖ్యలు
– టిఆర్ఎస్ చేతికి కొత్త అస్త్రాలు
– వివేక్ సహా రాజేందర్ కాంగ్రెస్ లో చేరుతారంటూ ప్రచారం
– ‘ధూంధాం’లతో టిఆర్ఎస్ లో కొత్త ఊపు
– ‘హుజురాబాద్’ లోనే అమాత్యులు కీలక నేతల మకాం
(హుజురాబాద్-విజయం న్యూస్)

హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారం ఘాటు ఎక్కిపోతోంది. అధికారపక్ష పార్టీ నేతలు విమర్శల అస్త్రాలకు మరింత పదును పెడుతూనే ఉన్నారు. ప్రత్యర్థులను టార్గెట్ గా చేసుకుని చేస్తున్న విమర్శలతో ఓటర్లకు మరింత చేరువ అవ్వాలన్నా ఎత్తుగడగా టిఆర్ఎస్ పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ ని లక్ష్యంగా టిఆర్ఎస్ కీలక నేతలు రాజకీయంగా వ్యక్తులు ఎత్తులు పైయెత్తులు వేస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. పైకి బీజేపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచినప్పటికీ అంతర్గతంగా కాంగ్రెస్ పార్టీతో ఈటల రాజేందర్ లోపాయికారి ఒప్పందం చేసుకున్నారన్న కేటీఆర్ విమర్శలు ఇందుకు ప్రత్యక్ష తార్కాణం. కాంగ్రెస్ తో అంటకాగుతునే ఉప ఎన్నికల్లో నామమాత్రంగా పోటీలో నిలుస్తున్నారని ప్రచారానికి దిగడం గమనార్హం. ఈ తాజా విమర్శల పర్వంలో హుజురాబాద్ సెగ్మెంట్లో నెలకొన్న స్థితి గతులపై ‘విజయం’ ప్రత్యేక కథనం.

‘ఈటెల నువ్వెంత’ అంటూ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చేసిన ఘాటు విమర్శలు నేడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అదేవిధంగా మాజీ ఎంపీ వివేక్ సహా ఈటల రాజేందర్ సైతం కాంగ్రెస్ పార్టీతో మంతనాలు జరుపుతున్నారని, ఉప ఎన్నికల అనంతరం కాంగ్రెస్ లో చేరడం ఖాయమని కూడా కేటీఆర్ పేర్కొనడం రాజకీయ దుమారం రేపుతోంది. ఇప్పటికే ఈ దిశగా వివేక్ చర్చలు సాగిస్తున్నారని, పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారని విమర్శించడంతో హుజరాబాద్ లో ఆసక్తికర రాజకీయ పరిణామాలు నెలకొన్నాయి. ఈ రెండు ఘాటైన విమర్శలు టిఆర్ఎస్ అధినేతలు ఉద్దేశపూర్వకంగానే ఈటెల ను చిక్కుల్లో పడేయడానికి ఎన్నికల ప్రచార అస్త్రంగా వాడుకుంటున్నారన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

** అగ్ర నేతలంతా అక్కడే మకాం..
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో టిఆర్ఎస్ లోని కీలక నేతలు సహా అమాత్యులు అక్కడే మకాం వేయడం విశేషం. ఇద్దరు ముగ్గురు మంత్రులు మూడు నెలలుగా హుజురాబాద్ చుట్టూ పరిభ్రమిస్తున్న తరుణంలో నేడు తాజాగా మరికొందరు మంత్రులు, కీలక నాయకులు జత కట్టడం గమనార్హం. కేటీఆర్, హరీష్ రావుతో పాటు పలువురు మంత్రులు మొదటి మొదటి వరకు మొన్నటి వరకు ప్రచారంలో పాల్గొన్నగా నేడు మరి కొందరు మంత్రులు, ప్రభుత్వ విప్ లు, ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు హుజురాబాద్ అభ్యర్థి తరఫున ప్రచారాన్ని చేపట్టడం టిఆర్ఎస్ తీసుకున్న ప్రాధాన్యతను, ప్రతిష్టాత్మకతను చెప్పకనే చెబుతోంది.

ALSO READ :- జానారెడ్డినే ఓడించాం.. ఈట‌ల అంత‌క‌న్నా పెద్ద లీడ‌రా..? : కేటీఆర్

టిఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపే లక్ష్యంగా పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు క్యాడర్ కేడర్ అంతా హుజురాబాద్ పయన మవుతోంది. పక్క జిల్లాల నేతలు సైతం హుజురాబాద్ ఉప ఎన్నికల్లో భాగస్వాములు కావడం ఎన్నికల ఆవశ్యకతను రూఢీ చేస్తోంది ది ప్రభుత్వ విప్ చెన్నూరు శాసనసభ్యుడు బాల్క సుమన్ మూడు నెలలుగా హుజురాబాద్ పైనే ప్రధానంగా దృష్టి సారించడం విశేషం. బాల్క అక్కడే మకాం వేయడంతో చెన్నూరు, మంచిర్యాల, బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల నేతలు సైతం హుజురాబాద్ తరలి వెళ్లారు దశలవారీగా తరలి వెళ్తూనే ఉన్నారు. జెడ్పి టిసిలు, ఎంపీపీలు, సర్పంచులు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, గ్రంథాలయ సంస్థ చైర్మన్లు, టిఆర్ఎస్ అనుబంధ సంఘాల బాధ్యులు సైతం హుజురాబాద్ కీలకంగా చేసుకొని ప్రచారాన్ని ఉండడంతో ఎక్కడలేని విధంగా ఇక్కడ రాజకీయం రగులు కుంటున్నదని పలువురు పేర్కొంటున్నారు.

** ‘ధూంధాం’లతో కొత్త జోష్..!
తమ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా కసరత్తు చేస్తున్న టిఆర్ఎస్ అధిష్టానం ఇక ధూమ్ దాం లపై దృష్టి సారించింది. ఇందులో భాగంగానే తాజాగా బుధవారం ప్రముఖ కళాకారుడు సాయి చందు బృందం చేత జమ్మికుంటలో ధూమ్ దాం కార్యక్రమాన్ని నిర్వహించాలన్న అభిప్రాయాలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. జమ్మికుంట లోని కోతగూడ మోతుగూడెం అంబేద్కర్ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున ధూమ్ ధామ్ కార్యక్రమం నిర్వహించిన పార్టీలో కొత్త జోష్ వచ్చినట్లు అవుతుందని నాయకులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా కేటీఆర్ లాంటి కీలక మంత్రులు ఈటెల పై ప్రచార అస్త్రాలు ఎక్కు పెట్టడం… దీనికి సమాంతరంగా ప్రచార పర్వాన్ని ప్రణాళికబద్ధంగా పడుతుండటం పార్టీకీ విజయావకాశాలు తెచ్చి పెట్టేవిగా రాజకీయ విశ్లేషకులు సైతం స్పష్టం చేస్తున్నారు.

ALSO READ :- కేసీఆర్.. యాదాద్రివద్ద తెల్చుకుందామా..? : బండి సంజయ్