Telugu News

కిషన్ రెడ్డి ర్యాలీలో ఎస్సెని కొట్టిన టీఆర్ఎస్ నేతలు*

ఉదృత్తంగా మారిన ఎన్నికల ప్రచారం

0

*కిషన్ రెడ్డి ర్యాలీలో ఎస్సెని కొట్టిన టీఆర్ఎస్ నేతలు*

ఎన్నికల ప్రచారంలో సంచలన ఘటన వెలుగుచూసింది. ఇల్లందకుంట మండలం సిరీసెడు గ్రామంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రచార ర్యాలీ పైకి టీఆర్ఎస్ కార్యకర్తలు దూసుకొచ్చారు. దీంతో అక్కడ ఒక్కసారిగా హై టెన్షన్ నెలకొంది. దీనికి తోడు మధ్యలో వచ్చి గొడవను ఆపుతున్న పోలీసులపై టీఆర్ఎస్ కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఏకంగా ఎస్సై చొక్కా పట్టుకుని దాడి చేశారు. ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ కార్యకర్తల దాడిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తామంటూ హెచ్చరించారు. కాగా, టీఆర్ఎస్ నేత బొమ్మెర రామ్మూర్తి ఆధ్వర్యంలో కార్యకర్తలు ఈ ఆందోళన చేపట్టినట్టు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

అందుకు సంబంధించిన వీడియో