Telugu News

హుజురాబాద్ లో అగ్రనేతల ఆరంగేట్రం…

హోరెత్తుతున్న హుజురాబాద్ ఉప సంగ్రామం

0

అగ్రనేతల ఆరంగేట్రం…
– హోరెత్తుతున్న హుజురాబాద్ ఉప సంగ్రామం
– నేటి నుండి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రచారం
– ప్రచారాన్ని ధీటుగా చేపట్టేందుకు కాంగ్రెస్ సన్నద్ధం – కదం తొక్కుతున్న గులాబి దండు
– ఇంటింటి ప్రచారం లతో దూసుకుపోతున్న పార్టీలు
– బెడ్ రెస్ట్ పేషెంట్లను ఓట్లు అడుగుతున్న వైనం
(మట్టె రవీందర్)
హుజురాబాద్-విజయం ప్రత్యేక ప్రతినిధి:

హుజరాబాద్ ఉప ఎన్నికల సంగ్రామం హోరెత్తుతోంది. తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం అగ్రనేతలు ఆరంగేట్రం చేస్తుండడం పార్టీ ప్రచార పర్వానికి దర్పణం పడుతోంది. ప్రత్యర్థుల పై విమర్శనాస్త్రాలు గుప్పిస్తున్న నేతలు తమ అభ్యర్థిని గెలిపించాలని ఫోటోలు దేవుళ్లను కోరుతున్నారు. అధికార పార్టీ సంక్షేమ పథకాల్ని ప్రజల దృష్టికి తీసుకెళ్తుండగా.. తమకు ఒకసారి అవకాశం ఇస్తే ప్రజల పక్షాన అసెంబ్లీలో గొంతుకై ప్రశ్నిస్తామని బిజెపి, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు తేటతెల్లం చేస్తున్నారు. ఆసక్తికరంగా వాడిన హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచార తీరుతెన్నులపై నేటి ‘విజయం’ సంచికలో ప్రత్యేక కథనం…

ఉప ఎన్నికల్లో భాగంగా భారతీయ జనతా పార్టీ పక్షాన కేంద్ర మంత్రి ఇ కిషన్ రెడ్డి నేటి నుండి హుజురాబాద్ పర్యటనకు విచ్చేస్తుండడంతో ఇక్కడ రాజకీయాలన్నీ ఠారెత్తి పోతున్నాయి. బిజెపి నుండి ఇ బరిలో దిగిన తాజా మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ గెలుపు కోసం ఆ పార్టీ నేతలు ప్రతిష్టాత్మకంగా ప్రచారం చేపడుతున్నారు. ఇప్పటికే పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ రంగంలో దిగగా నేటి నుండి కిషన్ రెడ్డి నియోజకవర్గంలో పర్యటిస్తుండడంతో ప్రచారాన్ని ఉదృతం చేసేందుకు స్థానిక నేతలు కసరత్తు చేస్తున్నారు. గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ప్రధానంగా దళితబంధు నిలిచి పోవడం వెనక ప్రభుత్వ కుట్ర దాగి ఉందని, కావాలనే తమపై ఆ నెపాన్ని వేస్తున్నారని బిజెపి నేతలు దుయ్యబడుతున్నారు.

** సంక్షేమ పథకాలతో ‘గులాబీ’ నేతలు…
ఉప ఎన్నికల్లో ప్రత్యర్థులను తిప్పికొట్టేందుకు అధికార టీఆర్ఎస్ తమ ప్రచార పటాటోపాన్ని మరింత పెంచింది. ఎందుకు కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల్ని ఒక్కొక్కటిగా కూలంకషంగా ప్రజలకు ఓటర్లకు వివరించేందుకు గులాబీ దండు రంగంలోకి దిగింది. రైతు బీమా, రైతుబంధు, కళ్యాణలక్ష్మి, ఉచిత విద్యుత్, షాదీ ముబారక్, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, దళిత బంధు తదితర సంక్షేమ పథకాల్ని ప్రచారాస్త్రంగా చేపట్టింది. ఇప్పటికే మూడు నెలలుగా హుజరాబాద్ లో మకాం వేసిన గులాబీ నేతలు ప్రచారాన్ని మరింత ఉదృతం చేశారు. నియోజకవర్గంలోని బూతుల వారీగా ప్రచారం చేపడుతున్నారు. ఇంటింటికి తిరుగుతూ టిఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను గెలిపించాలని కోరుతున్నారు. రాష్ట్ర అ సంక్షేమ శాఖ మంత్రి మాత్యులు కొప్పుల ఈశ్వర్ ప్రభుత్వ విప్ బాల్క సుమన్ తదితరులు ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రచారం చేపడుతుండటం గమనార్హం.

 

** బెడ్ రెస్ట్ పేషెంట్లను వదలట్లేదు..!
ఇంటింటా ప్రచారం తో దూసుకెళ్తున్న గులాబి శ్రేణులు బెడ్ రెస్ట్ లో ఉన్న పేషెంట్లకు సైతం వదలడం లేదు. స్వయంగా వారి ఇంటికి వెళ్లి తమ అభ్యర్థిని గెలిపించాలని అభ్యర్థిస్తుండడం విశేషం. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం కమలాపూర్ లోని పద్మశాలి వాడ, 266వ బూతులోనూ ఇదే తరహా ప్రచారాన్ని టిఆర్ఎస్ నాయకులు చేపట్టారు.

ALAO READ :- హుజురాబాద్ లో అగ్రనేతల ఆరంగేట్రం…

ఇప్పటికే నమూనా బ్యాలెట్ ఈవీఎంలను రూపొందించిన పార్టీ వర్గాలు ఎన్నికల గుర్తుల నమూనా జాబితాలో రెండవ నెంబర్ లో ఉన్న తమ అభ్యర్థిని గెలిపించాలని కోరుకొండ డన్ గమనార్హం. టిఆర్ఎస్ అభ్యర్థి పక్షాన అమాత్యులు మొదలు గ్రామ సర్పంచులు కౌన్సిలర్ ల దాకా ప్రచారంలో విస్తృతంగా పాల్గొనడం ఆ పార్టీ అభ్యర్థికి కలిసొచ్చే అంశంగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

** ప్రశ్నించే గొంతుక అవుతాం ఆదరించండి…
కీలకంగా మారిన హుజురాబాద్ ఉప ఎన్నికల్లో తనను గెలిపిస్తే అసెంబ్లీలో గొంతుక అవుతానని కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ నర్సింగ్ రావు పేర్కొంటున్నారు. ఇప్పటికే జాతీయ పార్టీ అయిన బీజేపీ ఓటర్లను మతాల పేర విభజిస్తుంటే.. అధికార టిఆర్ఎస్ పార్టీ కులాల పేరిట ప్రజల్ని చీల్చేందుకు యత్నిస్తోందని ఆయన దుయ్యబట్టడం గమనార్హం. మొత్తానికి ప్రధాని అభ్యర్థుల విమర్శలతో హుజురాబాద్ రాజకీయ ముఖచిత్రం వేడెక్కిపోతుంది. ఇప్పటికే అగ్రనేతల ప్రచార పర్వంతో హోరెత్తి పోతున్న ఇక్కడి వాతావరణం విమర్శల ధాటితో మరింత ఉధృతంగా మారుతున్నదని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ALAO READ :- ఎన్నికల క్రతువులో అధికార యంత్రాంగం