Telugu News

పోలీస్ సార్ సల్లగుండాలే.. వృద్దురాలు కితాబు.. ఎందుకో..?

పోలీసులను అభినంధించిన వృద్దురాలు

0

*పోలీస్ సార్ సల్లగుండాలి*

** పోలీసులను అభినంధించిన వృద్దురాలు

(హుజురాబాద్-విజయం న్యూస్)

పోలీస్ సార్ సల్లగుండాలని అంటూ వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషిని చూస్తూ ఓ వృద్దురాలు పలిక పలుకులివి…
వివరాల్లోకి వెళితే హుజూరాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా కమలాపూర్ మండలం లో ఎన్నికలు నిర్వహిస్తున్న పోలింగ్ కేంద్రాలను వరంగల్ పోలీస్ కమిషనర్ శనివారం సందర్శించినప్పుడు చోటుచేసుకున్న సంఘటన ఇది. కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామానికి చెందిన వృద్దమహిళ ఈ రోజు ఓటు హక్కును వినియోగించుకోనేందుకు ఉప్పల్ గ్రామంలోని ఒక పోలింగ్ కేంద్రానికి వెళ్ళాల్సింది పోయి మరో పోలింగ్ కేంద్రానికి వచ్చింది. తీరా ఓటు వేసే సమయంలో తను ఓటు వేయాల్సింది ఈ కేంద్రంలో కాదంటూ ఎన్నిక సిబ్బంది వృద్దురాలికి తెలపడంతో…

అసలై వృద్ధాప్యం అందులో నడవలేని స్థితిలో వుండటంతో…ఒక్కసారిగా నిస్సహాయస్థితిలో పోలింగ్ కేంద్రం ప్రధాన ద్వారంలో నడవలేని స్థితిలో రోడ్డుపై కూర్చుండిపోయింది. అదే సమయంలో పోలీస్ కేంద్రాన్ని పరీశీలించేందుకు వచ్చిన పోలీస్ కమిషనర్ సదరు వృద్దురాలిని గమనించి పోలీస్ కమిషనరే వృద్దురాలి వద్దకు వెళ్లి జరిగిన విషయం తెలుకున్న పోలీస్ కమిషనర్ స్వయంగా తన వద్ద వున్న పోలింగ్ కేంద్రాల చిట్టాలో వృద్దురాలి వద్ద వున్న పోల్ చిట్టీ అధారంగా సదరు వృద్దురాలు ఓటు వినియోగించుకోవాల్సిన పోలింగ్ కేంద్రాన్ని గుర్తించి పోలీసుల సహయంతో వృద్దురాలిని ఆటో ఎక్కించి పోలింగ్ కేంద్రానికి పంపింన పోలీస్ కమిషనర్ ను నడవలేని న న్ను పోలింగ్ కేంద్రానికి ఆటో పంపిస్తున్న పోలీస్ సార్ సల్లంగుండాలని వృద్దురాలు సిపి దీవించిండం జరిగింది…. ఓటేసేందుకు అక్కడికి వచ్చిన ఓటర్లు పోలీస్ కమిషనర్ కు వృద్దుల పట్ల వున్న గౌరవాన్ని ప్రత్యక్షంగా చూసిన ప్రజలు తమ సంతోషాన్ని వ్యక్తం చేసారు…

Also read :- ‘క్రాస్ ఓటింగ్’ బెడదా తప్పదా….!?