Telugu News

హోరాహోరీగా హుజురాబాద్ ఉప పోరు

ఎమ్మెల్యే పీఏ కిరణ్ ను పట్టుకున్న బీజేపీ కార్యకర్తలు

0

హోరాహోరీగా హుజురాబాద్ ఉప పోరు
– టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు మకాం వేసి డబ్బులు పంచుతున్నారని ఆరోపణలు
– వర్ధన్నపేట ఎమ్మెల్యే పీఏ కిరణ్ ను పట్టుకున్న బీజేపీ కార్యకర్తలు
– ఈటెల కాన్వాయ్ లోని మూడు వాహనాలు సీజ్
– టిఆర్ఎస్ నేతలు డబ్బులు పడుతున్నారని పోలీసులకు చెప్పినా పట్టని వైనం
– మధ్యాహ్నం 3 గంటల వరకు 61.66 శాతం పోలింగ్ నమోదు

(హుజురాబాద్- విజయం ప్రత్యేక ప్రతినిధి)
హైదరాబాదులో హుజరాబాద్ ఉప ఎన్నికల పోరు హోరాహోరీగా సాగుతోంది. డబ్బులు పంచుతున్నారు అన్న ఆరోపణలు ఇంకా వెల్లువెత్తుతున్నాయి. స్వయంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు, వారి పీఏలు నియోజకవర్గంలోనే సంచరిస్తూ ఉండడం పలు అనుమానాలకు దారితీస్తోందని అన్నారు. కాగా శనివారం మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ శాతం 61.66గా నమోదైంది. మరోవైపు కమలాపూర్ మండలంలోని మరి పెళ్లి గూడెం లో ఈటల రాజేందర్ కాన్వాయ్ లోని మూడు వాహనాలను ఎన్నికల అధికారులు సీజ్ చేశారు. దీంతో పాటు రాజేందర్ పిఆర్ఓను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

హుజరాబాద్ లోనే ఎమ్మెల్యేల పీఏలు..
హుజరాబాద్ లో ఉప ఎన్నికలు పోటాపోటీగా సాగుతున్నప్పటికీ అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మాత్రం ఇక్కడి నుండి వెళ్లక పోవడం గమనార్హం స్థానికేతరుడైన వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పిఎ కిరణ్ స్థానికంగా ఉండడంతో డబ్బుల పంపిణీకి పాల్పడుతున్నారని ఆగ్రహించి బిజెపి నాయకులు కిరణ్ పోలీసులకు అప్పగించారు.

కౌన్సిలర్ దీప రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత..
ఉప ఎన్నికల సందర్భంగా కౌన్సిలర్ దీపా రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి కౌన్సిలర్ ఇంట్లో ఎమ్మెల్యే రమేష్ ఉన్నట్లు బిజెపి నాయకులు ఆందోళనకు దిగారు దీంతో కరీంనగర్ కమిషనర్ సత్యనారాయణ అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు ఇంట్లోకి వెళ్లి ఎమ్మెల్యే లేరని, ముగ్గురు అపరిచితులు ఉన్నారని వారిపై కేసు నమోదు చేసినట్లు స్పష్టం చేయడంతో పరిస్థితి సద్దుమణిగింది.

Also read :- తుల ఉమాను అడ్డుకున్న టీఆర్ఎస్ నేతలు