Telugu News

హుజురాబాద్ లో టెన్షన్…టెన్షన్..

పలుచోట్ల ఉద్రిక్త వాతావరణం

0

హుజరాబాద్ లో కొనసాగుతున్న పోలింగ్ ప్రక్రియ
– మధ్యాహ్నం1 గంట వరకు 45.63% నమోదు
– పలుచోట్ల ఉద్రిక్త వాతావరణం
– టీ న్యూస్ వాహనాల్లోనే డబ్బులు పంపుతున్నారని బీజేపి ఆగ్రహం
– కౌశిక్ రెడ్డిని అడ్డుకున్న స్థానికులు
– నేటికీ హుజరాబాద్ లో వీడని అధికార పార్టీ స్థానికేతర నేతలు
– పోలీసులే దగ్గరుండి మద్యం, డబ్బుల పంపిణీకి సహకరిస్తున్నారని ఈటల విమర్శ

(హుజురాబాద్- విజయం ప్రత్యేక ప్రతినిధి)

ఉద్రిక్త వాతావరణంలో హుజరాబాద్ ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. గంట గంటకు భారీస్థాయిలో పోలింగ్ నమోదు పెరుగుతోంది. ఉదయం 11 గంటల వరకు ఓటింగ్ శాతం 33.27 నమోదుకాగా మధ్యాహ్నం1గంటకు 45.63 నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. గంటకు ఎనిమిది శాతం చొప్పున పోలింగ్ పెరుగుతున్నదని తెలుస్తోంది. సాయంత్రం ఏడు గంటల కల్లా ఓటింగ్ శాతం దాదాపు 90 శాతం నుంచి పోతుందని ప్రస్తుత పోలింగ్ సరళిని బట్టి స్పష్టమవుతోంది. మొత్తానికి అధికార టిఆర్ఎస్ తన పార్టీ యంత్రాంగాన్ని హుజురాబాద్లో మోహరించి గెలుపు కోసం కుయుక్తులు పన్నుతోందని బీజేపీ విమర్శిస్తోంది.

నేటికి స్థానికేతరుల తాకిడి.. హుజురాబాద్ లో సైలెంట్ పీరియడ్ అమల్లో ఉందని ఎన్నికల అధికారులు విన్నవించిన అధికార టీఆర్ఎస్ పార్టీ పెడచెవిన పెడుతూ ఉన్నట్లు తెలుస్తోంది ఈ నెల 27వ తేదీన ఎన్నికల ప్రచారం ముగిసిన అనంతరం స్థానికేతరులు హుజురాబాద్ విడిచి వెళ్లాలని చెప్పినప్పటికీ ఫలితం లేకపోయింది శనివారం పోలింగ్ జరుగుతున్న కొద్దీ స్థానికేతరులు ఒక్కొక్కరు బయటకు రావడం ఎన్నికల వాతావరణాన్ని అవమానం చేస్తుందని అంటున్నారు వరంగల్ కు చెందిన జడ్పిటిసి కరుణాకర్, గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, పలువురు నేతలు లు తిక్కన చేశారని స్థానికులు మండిపడుతున్నారు. మరోవైపు టిఆర్ఎస్ నేత కౌశిక్ రెడ్డి పోలింగ్ కేంద్రాలలో పర్యటిస్తూ టిఆర్ఎస్ కే ఓటు వేయాలని లేకుంటే మీ అంతు చూస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని బిజెపి ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది. దీంతో అనంతరం లేక పోలీసులు కౌశిక్ రెడ్డిని తిప్పి పంపించారు.

§

టీ న్యూస్ మీడియావాహనాల్లో డబ్బుల పంపిణీ…
ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న అక్కసుతో అధికార టీఆర్ఎస్ పార్టీ వివిధ అక్రమ మార్గాలు తొక్కుతున్నదని బీజేపీ శ్రేణులు వాపోతున్నాయి. టీ న్యూస్ మీడియా వాహనాల్లో రిపోర్టర్ల ముసుగులో డబ్బుల పంపిణీ నిర్వహిస్తున్నారని స్థానికులు గుర్తించి ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. ఒక రిపోర్టర్ సహా మరో ముగ్గురిని పట్టుకొని అధికారులకు అప్పగించారు. నియోజకవర్గంలో గణ్ముఖ, కోర్ చెల్పూర్, రేకుర్తి, కమలాపూర్ తదితర ప్రాంతాల్లో టిఆర్ఎస్ బిజెపిలకు మధ్య చిన్నపాటి ఘర్షణలు చోటు చేసుకున్నాయి.

పోలీసులే దగ్గరుండి సహకరిస్తున్నారు: ఈటెల
కమలాపూర్ లో తన భార్యతో సహా ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ మీడియాతో మాట్లాడారు ఎన్నికల్లో సాక్షాత్తూ పోలీసులే దగ్గరుండి అధికార పార్టీకి అన్ని విధాలుగా సహకరిస్తున్నారని వాపోయారు. మద్యం, డబ్బుల పంపకాలు జరుగుతున్న చూసీ చూడనట్లుగా వ్యవహరించారని, మరో అడుగు ముందుకేసి పోలీసులే డబ్బుల పంపిణీకి ఎస్కార్ట్ గా పని చేశారని దుయ్యబట్టారు. పోలీసులే ఈ విధంగా ప్రవర్తిస్తే ఇదేమి ప్రజాస్వామ్యమని ఆయన ప్రశ్నించారు.

also read :- ‘క్రాస్ ఓటింగ్’ బెడదా తప్పదా….!?