Telugu News

 హైదరాబాదులో దారుణం..బాలికపై బాలుడు లైంగికదాడి

కేసు నమోదు చేసిన పోలీసులు

0

హైదరాబాదులో దారుణం..బాలికపై బాలుడు లైంగికదాడి 

— కేసు నమోదు చేసిన పోలీసులు 

(హైదరాబాద్- విజయం న్యూస్):

పదిహేనేండ్ల బాలికపై ఓ పదహారేండ్ల బాలుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన సైదాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.పూర్తి వివరాల్లోకెళ్తే. ఐఎస్‌సదన్ డివిజన్‌లోని ఓ బస్తీలో ఉండే బాలిక(15) అదే ప్రాంతంలో ఉండే బాలుడు(16) వారి కుటుంబ సభ్యులతో ఉంటున్నారు. ఇరు కుటుంబాలు దినసరి కూలీలుగా పని చేస్తున్నారు. అయితే బాలికపై ఆ బాలుడు పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు.శుక్రవారం బాలికకు తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో ఆమె తల్లి ఆస్పత్రికి తీసుకెళ్లింది. దాంతో బాలిక ఐదు నెలల గర్భవతి అని గుర్తించారు.విషయం తెలుసుకున్న బాలిక తల్లి, కుటుంబ సభ్యులు సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.వారు కేసు నమోదు చేసి బాలుడిని అదుపులోకి తీసుకుని బాలుర సంరక్షణ కేంద్రానికి తరలించారు. మలక్‌పేట్ ఏసీపీ వెంకటరమణ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ALSO READ :- చత్తీస్ ఘడ్ లో ఎన్ కౌంటర్