Telugu News

టీఎస్‌ కన్జ్యూమర్‌ ఫోరం తొలిసారి జైలు శిక్ష విధింపు

(హైదరాబాద్‌ విజయం న్యూస్ ): -

0

టీఎస్‌ కన్జ్యూమర్‌ ఫోరం:- తొలిసారి జైలు శిక్ష విధింపు

(హైదరాబాద్‌ విజయం న్యూస్ ): –

తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌ తన చరిత్రలోనే తొలిసారిగా
ఓ సంస్థకు జైలు శిక్ష విధించింది.ఘరోండ బిల్డర్స్‌ ఎండీ సునీల్‌ జె.సచ్‌దేవ్‌కు 3 కేసుల్లో 6 నెలల చొప్పున జైలు శిక్ష విధిస్తూ తాజాగా తీర్పు వెలువరించింది.

also read :-ఖమ్మం డిపో ఉద్యోగులకు అవార్డుల పంట

సొమ్ము తీసుకొని ఫ్లాట్లు అప్పగించడం లేదని ఘరోండ బిల్డర్స్‌పై అభియోగం.ఈ కేసులో ముగ్గురు వినియోగదారులకు వడ్డీతో సహా సొమ్ము చెల్లించాలని 2017లో కమిషన్‌ తీర్పునిచ్చింది.ఐదేళ్లైనా తీర్పు అమలు చేయకపోవడంతో బిల్డర్‌పై కమిషన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది.ఈ మేరకు తాజాగా జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది.