Telugu News

మల్లు స్వరాజ్యం ఇక లేరు

= హైదరాబాద్ కేర్ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిసిన మల్లుస్వరాజ్యం

0

మల్లు స్వరాజ్యం ఇక లేరు
== హైదరాబాద్ కేర్ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిసిన మల్లుస్వరాజ్యం
== సాయుధపోరాట యోధురాలుగా గుర్తింపు
(హైదరాబాద్-విజయంన్యూస్)
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం(91) ఇకలేరు.. 13ఏళ్ల వయస్సులోనే జనం కోసం తుపాకీ పట్టిన ఆమె శనివారం సాయంత్రం కన్నుమూశారు.ఊపిరితిత్తుల సమస్యతో కొంతకాలంగా బాధపడుతున్న ఆమె.. మార్చి 2న బంజారాహిల్స్‌ లోని కేర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె శనివారం సాయత్రం తుదిశ్వాస విడిచారు.

also read :-ఎపెక్స్‌ లో అరుదైన శస్ర్త చికిత్స

ఈ విషయాన్ని వైద్యులు ప్రకటించారు. ఆమె భౌతికకాయాన్ని ఆస్పత్రి నుంచి నేరుగా ఎంబీ భవన్‌కు తరలించనున్నారు.13 ఏళ్ల వయస్సులోనే సాయుధ పోరాటంలో పాల్గొన్న మల్లు స్వరాజ్యం.. తుపాకీ పట్టిన మొదటి మహిళగా పేరుతెచ్చుకున్నారు. ఆమె తుంగతుర్తి నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1931లో సూర్యపేట జిల్లా కరివిరాల కొత్తగూడెంలో ఆమె జన్మించారు. 13ఏళ్లకే తెలంగాణ సాయుధ పోరాటంలో మొదటి తుపాక్ పట్టిన మహిళగా గుర్తింపు తెచ్చుకుంది. నైజాం సర్కార్ ను గడగడలాడించిన మల్లుస్వరాజ్యం..దొరల అహంకారన్ని అదునుపట్టి పాటలతో ప్రజలను చైతన్యం చేసిన మహిళ ఆమె. తెలంగాణ సాయుధపోరాట సమయంలోనే ఆమెకు 10వేల రివార్డు. మల్లు రేపు నల్గొండలలో మల్లు స్వరాజ్యం భౌతికకాయం ఉంటుందని తెలిపారు. సీపీఎం నేత తమ్మినేని, సీపీఐ నేత నారాయణ సంతాపం ప్రకటించారు.