Telugu News

నర్సింహులపేట మండలంలో విచ్చలవిడిగా ఇసుక డంపులు

నిరుపేద కుటుంబాల పై ప్రతాపం చూపిస్తున్న అధికారులు

0

నర్సింహులపేట మండలంలో విచ్చలవిడిగా ఇసుక డంపులు

★★ నిరుపేద కుటుంబాల పై ప్రతాపం చూపిస్తున్న అధికారులు

★★ మండలంలో వేలల్లో, సుమారు 30 లక్షల విలువచేసే డంపులు

★★ ఆ డంపుల పై నేటికీ కూడా కన్నెత్తని రెవెన్యూ బాస్

★★ ఆ ఇసుక డంపుల పై కాసులు ముట్టినట్లు ఆరోపణలు..?

(నర్సింహులపేట/విజయం న్యూస్)

నిరుపేద కుటుంబాల పై నర్సింహులపేట తహసిల్దార్ విజయ్ కుమార్ తన ప్రతాపం చూపిస్తున్నారు. కాయకష్టం చేసి, కూలినాలి చేసుకుని తన ఇంటిని, గుడును చక్కదిద్దిటకు తన కుటుంబ అవసరాల కొరకు ఇసుకను పోసుకొని గూడు నిర్మించుకుంటున్నారు. ఇలాంటి నిరుపేద కుటుంబాల పై ఇసుక ను
వారి ఇంటి అవసరాల కొరకు పోసుకోగా, దాన్ని ఆసరాగా తీసుకుని రెవెన్యూ అధికారులు డంపులు గా ట్రీట్ చేసి, ఆ కుటుంబాలను వేధిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. బుధవారం నర్సింహులపేట మండలం గోల్డ్ బోడ్క తండ శివారు దూపియా తండా కు చెందిన బానోతు రాజన్న ఓ నిరుపేద కుటుంబం కి సంబంధించి నూతన ఇల్లు ప్లాస్టింగ్ కొరకు పోసుకున్న (8) ట్రిప్పుల ఇసుకను డంపు చేసినట్లుగా క్రియేట్ చేసి అధికారులను తప్పుదోవ పట్టించి, వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆ తండా గిరిజనులు ఆరోపిస్తున్నారు.

Allso read:- 9 నుంచి మీనవోలు నుంచి భట్టి పాదయాత్ర

మండలంలోని కొమ్ములవంచ గ్రామ శివారు లోని కొమ్ములవంచ, దుబ్బ తండ, ఎర్ర చక్రు తండా మామిడి తోటలో, వివిధ తండాలలో సుమారు (500) ఐదు వందల ట్రిప్పుల ఇసుక డంపులు చేసిన వాటి గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. వాటి గురించి పట్టించుకోకపోవడానికి కారణం ఏమిటో..? అని, ఆ పెద్ద సార్ కి ఎంత ముడుపులు ముట్టాయో.? అని ఆరోపణలు వినిపిస్తున్నాయి. బొజ్జన్నపేట గ్రామ శివారులోని బొజ్జన్న పేట బీడు భూముల్లో, గ్రామ ఇళ్లల్లో సుమారు (3000) మూడు వేల ట్రిప్పుల ఇసుక ఇంటింటికి 100 నుంచి 150 ట్రిప్పుల ఇసుక, ఆ గ్రామ చుట్టుపక్కల ప్రాంతాలలో బీడు భూములలో లలో, మామిడి తోటలో కలవు. వీటిపైన నేటికీ రెవెన్యూ సిబ్బంది తో విచారణ చేయకుండా వాటిని వదిలివేయడానికి వెనకాల ఆంతర్యమేమిటని మండల ప్రజలు గుసగుసలాడుతున్నారు. ఎటు చూసినా ఇసుక డంపులే వాటి పైన ఆ పెద్ద సారు ఎందుకు కన్నెత్తి చూడడం లేదని పలు ఆరోపణలు కలవు. ఇంత భారీ ఎత్తున అవినీతి జరుగుతున్నా ఆ పెద్ద సార్ కు కనువిప్పు కలగడం లేదా.? అని వివిధ ప్రజా సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. కౌసల్యాదేవి పల్లి గ్రామ శివారు లోని పలు ఇళ్లల్లో, చేలకల లలో, అనేక డంపులున్న వాటిపైన పట్టించుకోకపోవడాన్ని కి కారణం ఏమిటో అని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. వీటి పైన దృష్టి సారించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. సామాన్యులపై ప్రతాపం చూపించడం ఏమిటని మండల వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మండల కేంద్రంలో ఇందిరా గాంధీ బొమ్మ (ఊర గుట్ట) విజ్డమ్ స్కూల్ పక్కన సమీపంలో సుమారు 50 ట్రిప్పుల ఇసుక, వెంకటేశ్వర థియేటర్ సమీపంలో ఒక గడిలో సుమారు 30 ట్రిప్పుల ఇసుక ఉన్న దాని గురించి పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. కాయకష్టం చేసి, రూపాయికి రూపాయి కూడేసుకొని, ఆ నిరుపేద కుటుంబాల పొట్టను కొడుతున్న తహసిల్దార్ పై ఆ పెద్దసారు ఇసుక డంపు యజమానులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని పలు కుల, ప్రజా సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి వెంటనే ఆ ఇసుకను సీజ్ చేసి సామాన్యులకు న్యాయం చేయవలసిందిగా ప్రజలు కోరుతున్నారు.