కెఎల్ డీమ్డ్ టు బీ యూనివర్శిటీలో టెక్నో ఫెస్ట్ ఇవర్ణ ;
ఉత్సాహంగా పాల్గొన్న వేలాది మంది విద్యార్థులు
కెఎల్ డీమ్డ్ టు బీ యూనివర్శిటీలో టెక్నో ఫెస్ట్ ఇవర్ణ ;
===ఉత్సాహంగా పాల్గొన్న వేలాది మంది విద్యార్థులు
(హైదరాబాద్ విజయం న్యూస్):-
హైదరాబాద్, 03 ఏప్రిల్ 2022 : గ్రాడ్యుయేషన్ మరియు ఉన్నత విద్య కోసం దేశంలో అగ్రగామి యూనివర్శిటీలలో ఒకటైన కె ఎల్ డీమ్డ్ టు బీ యూనివర్శిటీ తమ వార్షిక టెక్నికల్ ఫెస్టివల్ ఇవర్ణ–2022ను ప్రారంభించింది. టెక్నాలజీ, ఇంజినీరింగ్, ఆర్ట్స్, కల్చర్ రంగాలో ్ల విద్యార్థుల ప్రతిభను వెలికి తీయడంతో పాటుగా వేడుక చేసే రీతిలో ఇది ఉంటుంది. కెఎల్‌హెచ్ ఇవర్ణ వద్ద పోటీలు విభిన్న అంశాలలో జరిగాయి. నగరంలోని వేలాది మంది విద్యార్థులు నెట్‌వర్కింగ్ చేసుకునేందుకు, ఆలోచనలను మార్పిడిచేసుకునేందుకు, పలు నైపుణ్యాధారిత పోటీలలో పాలుపంచుకునేందుకు ఇది తోడ్పడుతుంది. ఈ టెక్నోఫెస్ట్ ద్వారా సృజనాత్మక సాంకేతికతలపై దృిష్టి సారించారు. అంతేకాకుండా విద్యార్థులలో దాగిన నైపుణ్య, సాంకేతిక శక్తిని మెరుగుపరచడం లక్ష్యంగా చేసుకున్నారు.
also read :-రేగా పాటల సిడి ఆవిష్కరణ…
తమ ప్రతిభను ప్రదర్శించుకునే ఎలాంటి అవకాశాన్నీ విద్యార్థులు వదలడం లేదు. తమ ప్రతిభకు అదనపు జోడింపుగా నిలిచే అంశాలనూ అంతే ఇష్టంగా నేరుస్తున్నారు. హైదరాబాద్‌లో దాదాపు 3వేల మంది విద్యార్ధులు ఇవర్ణ 22 లో పాల్గొన్నారు.ఈ సంవత్సరపు ఎడిషన్‌లో అతి కీలకమైన అంశం ఏమిటంటే, సాంకేతికతపై అధిక దృష్టికేంద్రీకరించి న కోడింగ్ సంబంధిత పోటీలను నిర్వహించడం. వీటిలో కోడ్–ఏ–థాన్; కోడింగ్ టు సర్వైవ్, హ్యాకథాన్, యుఐ/యుఎక్స్ వంటివి ఉన్నాయి. దీనిలో పలు సాహిత్య, సాంస్కృతిక పోటీలు సైతం జరుగుతున్నాయి. వీటిలో డిబేట్, నృత్యం, సంగీతం, ఫోటోగ్రఫీ, ఓపెన్ మైక్స్ మొదలైనవి ఉన్నాయి. ఈ పోటీల విజేతలకు ఆకర్షణీయమైన బహుమతులు సైతం లభించాయి.
also read :-కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దొందూ దొందే
ఈ ఫెస్ట్ గురించి ప్రొఫెసర్ ఎల్ కోటేశ్వరరావు, ప్రిన్పిపాల్, ఇంజినీరింగ్, కెఎల్ డీమ్డ్ టు బీ యూనివర్శిటీ , హైదరాబాద్ మాట్లాడుతూ ‘‘కెఎల్‌హెచ్ వద్ద మేము పోటీలు ఆవిష్కరణను సైతం పెంచుతాయని నమ్ముతున్నాము. ఇవర్ణ అనేది మా ప్రతిష్టాత్మక సాంకేతిక కార్యక్రమం. దీనిలో విద్యార్థులు తమ ఆలోచనలు పెంచుకోవడం, మెరుగుపరుచుకోవడం చేయనున్నారు. ప్రతి వ్యక్తి తమ హద్దులను పునర్నిర్వచించడంతో పాటుగా విజయానికి ఓ మార్గం వేసుకోగలరు. మేము పలు సాంకేతిక మరియు సాంస్కృతిక కార్యక్రమాలను సైతం నిర్వహించాము. ఈ రెండు రోజుల పాటు ప్రతిభావంతులకు తగిన అవకాశాలు లభిస్తాయి’’ అని అన్నారు.
ఈ తరహా భారీ పోటీలు విద్యార్థులకు సృజనాత్మక ఆలోచనలు మెరుగుపరుచుకునేందుకు తోడ్పడటంతో పాటుగా వారి సాంకేతిక నైపుణ్యం సైతం మెరుగుపరుచుకునేందుకు తోడ్పడతాయి. అంతేకాకుండా వారి భవిష్యత్‌కు ఆత్మవిశ్వాసంతో మార్గం వేసుకునేందుకు సైతం సహకరిస్తాయి. కె ఎల్‌డీమ్డ్ టు బీ యూనివర్శిటీ యొక్క నైపుణ్యాభివృద్ధి విభాగం మరియు సెంటర్ ఫర్ ఇన్‌క్యుబేషన్ ఈ తరహా వ్యవస్థాపక సంస్కృతిని ప్రోత్సహిస్తున్నాయి మరియు నైపుణ్యాధారిత వ్యవస్థను తీర్చిదిద్దడం ద్వారా పోటీలకు అత్యంత అనువైన కేంద్రంగానూ నిలుపుతుంది.
About KL Deemed-to-be University
Founded in 1980 as KL College of Engineering, KL Deemed to be University brings today an academic legacy of 40+ years. It became Deemed University in 2009 and was accredited by NAAC with A++ grade and Category- I Institution by UGC, MHRD, Govt. of India in 2019. It is ranked 35th in the NIRF 2021 rankings of top Universities of India. K L Deemed University is situated in a spacious 100-acre campus in Vijayawada and has another world-class campus in Hyderabad. The University boasts of its collaborations with 60+ foreign Universities across 16 countries providing students international exposure through internships and exchange programs. The intellectual resource at university includes 1,200+ faculty members, out of which 600+ faculty members are Ph.D. holders. The University also rejoices an impeccable placement track record of placing over 22,000 students in reputed companies so far. For more details please visit – https://www.kluniversity.in/