Telugu News

ఆటోలోనే సూట్ కేస్ ను మార్చిన యువకుడు..

రెండు గంటల్లోనే చేదించిన పోలీసులు..

0

ఆటోలోనే సూట్ కేస్ ను మార్చిన యువకుడు..

రెండు గంటల్లోనే చేదించిన పోలీసులు..

(హైదరాబాద్ విజయం న్యూస్) :

ఓ ప్రయాణికుడు ఉబెర్ ఆటోలో ఇంటికి వెళ్తూ.. ఆ వాహనంలోనే సూట్‌కేస్‌ను మరిచిపోయాడు. ఇంటికి వెళ్లిన తర్వాత సూట్‌కేస్ మరిచిపోయానన్న విషయాన్ని సదరు ప్రయాణికుడు గ్రహించాడు. అప్రమత్తమైన అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు 2 గంటల్లోనే ఆ ఆటోను కనిపెట్టి, బాధిత వ్యక్తికి సూట్‌కేస్‌ను అప్పగించారు.

also read :-హన్మకొండ లో గాలి దుమారానికి కూలిన కేటిఆర్ సభా వేదిక, టెంట్లు

వివరాల్లోకి వెళ్తే.. సైదాబాద్ పరిధిలోని లక్ష్మీనగర్‌కు చెందిన మహేందర్ రెడ్డి ఉబెర్ ఆటో బుక్ చేసుకుని పీర్జాదిగూడ నుంచి ఇంటికి చేరుకున్నాడు. అయితే అతని వెంట ఉన్న సూట్‌కేస్‌ను ఆటోలోనే మరిచిపోయాడు. దీంతో సైదాబాద్ క్రైమ్ పోలీసులకు బాధిత వ్యక్తి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆటో నెంబర్ ఆధారంగా డ్రైవర్‌ను పోలీసులు గుర్తించారు. అలా.. రెండు గంటల్లోనే ఆటోను కనిపెట్టి.. అందులో ఉన్న సూట్‌కేస్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ సూట్‌కేస్‌లో రూ. లక్ష విలువైన పట్టు చీరెలు ఉన్నట్లు మహేందర్ రెడ్డి తెలిపాడు. తన సూట్‌కేస్‌ను అప్పగించిన క్రైం పోలీసులకు మహేందర్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు.