Telugu News

కామాంధుడి బారి నుంచి కాపాడాలంటూ యువతి ఆర్తనాదాలు

నిందితుడి అరెస్టు

0

కామాంధుడి బారి నుంచి కాపాడాలంటూ యువతి ఆర్తనాదాలు

==నిందితుడి అరెస్టు

(హైదరాబాద్‌ విజయం న్యూస్) :-

యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన యువకుడిపై ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ ప్రజాప్రతినిధి కార్యాలయంలో పనిచేసే ఖలీల్‌ తన వెకిలి చేష్టలతో ఓ యువతిని ఎర్రగడ్డలోని సుల్తాన్‌ నగర్‌ నుంచి రాజీవ్‌నగర్‌ వరకు బైక్‌పై వెంబడించాడు. రాయల్‌ ఫంక్షన్‌ హాలు వద్దకు రాగానే యువతిని అటకాయించి అసభ్యంగా ప్రవర్తించాడు.

also read;-మాజీ శాసన సభ్యుడికి యావజ్జీవ కారాగార శిక్ష

దీంతో బాధితురాలు.. కామాంధుడి బారి నుంచి కాపాడాలంటూ బిగ్గరగా ఆర్తనాదాలు చేయడంతో స్థానికులు డయల్‌ 100కు ఫోన్‌ చేశారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు స్థానికుల సహకారంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈదృశ్యాలన్నీ స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. పట్టుబడ్డ నిందితుడు ఖలీల్‌ మాజీ డిప్యూటీ మేయర్‌ కార్యాలయంలో పనిచేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. బాధితురాలు ఓ డీఎస్పీ ఇంట్లో వంట మనిషిగా పనిచేస్తోంది. ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌.ఆర్‌.నగర్‌ పోలీసులు తెలిపారు.