Telugu News

ఇంట‌ర్ ప‌రీక్ష‌ల షెడ్యూల్‌పై (T or T)రేపు స్ప‌ష్ట‌త ఇస్తాం : మంత్రి స‌బిత‌

విజయం న్యూస్

0

ఇంట‌ర్ ప‌రీక్ష‌ల షెడ్యూల్‌పై (T or T)రేపు స్ప‌ష్ట‌త ఇస్తాం : మంత్రి స‌బిత‌

(హైద‌రాబాద్ విజయం న్యూస్):-

తెలంగాణ ఇంట‌ర్ ప‌రీక్ష‌ల తేదీల‌పై జేఈఈ మెయిన్స్ షెడ్యూల్ ప్ర‌భావం చూపింది. ఈ నేప‌థ్యంలో ఇంట‌ర్ ప‌రీక్ష‌ల షెడ్యూల్‌పై ఇవాళ లేదా రేపు స్ప‌ష్ట‌త ఇస్తామ‌ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి స్ప‌ష్టం చేశారు. ఈ ప‌రిస్థితుల మ‌ధ్య ఇంట‌ర్ ప‌రీక్ష‌ల షెడ్యూల్ మార్చ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని మంత్రి పేర్కొన్నారు.

also read;-టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు నర్సింహులకు స్వాగతం పలికిన ఖమ్మంజిల్లా టీడీపీ నాయకులు..

జేఈఈ మెయిన్‌ (JEE Main) మొదటి సెషన్‌ పరీక్ష తేదీలను ఎన్‌టీఏ రీ షెడ్యూల్‌ చేసింది. గతంలో విడుదల చేసిన షెడ్యూల్‌ ప్రకారం ఏప్రిల్‌ 16 నుంచి 21 మధ్య జేఈఈ పరీక్ష జరగాల్సి ఉన్నది. అయితే అవే తేదీల్లో వివిధ రాష్ట్రాల్లో ఇంటర్‌ పరీక్షలు జరుగనున్నాయి. దీంతో విద్యార్థుల విజ్ఞప్తి మేరకు పరీక్ష తేదీల్లో నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) మార్పు చేసింది. తాజాగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఏప్రిల్‌ 21, 24, 25, 29 తేదీల్లో, మే 1, 4 తేదీల్లో జేఈఈ మెయిన్‌ మొదటి సెషన్‌ పరీక్షలు నిర్వహించనున్నారు.