Telugu News

పరిశుభ్రతే..మనిషికి ప్రధాన రక్షణ..

దోమల నియంత్రణతోనే డెంగ్యూ నివారణ

0

పరిశుభ్రతే.. మనిషికి ప్రధాన రక్షణ

◆◆ దోమల నియంత్రణతోనే డెంగ్యూ నివారణ

■■ పరిశరాల పరిశుభ్రత చాలా అవసరమంటున్న వైద్యులు

◆◆ రేపు డెంగీ నివారణ దినోత్సవం

(పెండ్ర అంజయ్య, విజయం ఎడిటర్)

ప్రస్తుతం గత మూడేళ్ల నుంచి కరోనా వైరస్ అంటే గజగజ వణుకుతున్నాం.. కానీ అదే తరహాలో అంతకంటే డెంజర్ గా ఉండే మరో వ్యాధి డెంగ్యూ.. కరోనా రాకముందు జిల్లా వ్యాప్తంగా వందల కేసులు నమోదు అవుతూ, ఆ జబ్బుతో ప్రాణాలు పొగొట్టుకున్నవారేందరో ఉన్నారు. అంతే కాకుండా డెంగ్యూ జ్వరంతో ఆసుపత్రి పాలై రక్తకణాలు పడిపోయాయని లక్షలు లక్షలు ఆసుపత్రులకు పెట్టి కుటుంబాలు రోడ్డున పడ్డ పరిస్థితులు ఉన్నాయి.. అయితే గత రెండేళ్ల నుంచి కరోనా పుణ్యామా అని డెంగ్యూ అచూకి లేకుండా పోయింది.. అయితే ఈ ఏడాది వానాకాలంలో మాత్రం డెంగ్యూ కేసులు మళ్లీ ప్రారంభమైయ్యాయి. జిల్లాలో కేసులు కూడా నమోదు అయ్యాయి. అంటే కరోనా మహామ్మారి మనల్ని వదిలివెళ్లిపోయిందేమో కానీ డెంగ్యూ వ్యాధి మాత్రం మనల్ని వదిలి వెళ్లిపోలేదంటే నమ్మాల్సిందే. డెంగ్యూ వ్యాధి మనం చేసే తప్పిదాల కారణంగా వచ్చే వ్యాధి.. అంటే మన పరిశరాలను పరిశుభ్రంగా ఉంచుకోకుండా అజాగ్రత్త పడటం వల్ల దోమల అత్యధికంగా వచ్చి అనేక వ్యాధులకు కారణమవుతుంటాయి. దోమల వల్లనే డెంగ్యూ వ్యాధి లక్షణాలు కల్గిన జ్వరం వస్తుంది. దోమల కారణంగా డెంగ్యూ వ్యాధి ఒక్కటే కాదు మలేరియా, చికిన్ గున్యా, పైలేరియా, మెదడు వ్యాపు లాంటి వ్యాధులు సంభవించే అవకాశం ఉంది. అయితే ఆ వ్యాధులు రాకుండా ఉండాలంటే మనమందరం కచ్చితంగా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతైన ఉంది.. అందు కోసం ప్రత్యేకంగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఈ కింది విధంగా జాగ్రత్తలు తీసుకుంటే చాలు..

Allso read-వదల మంత్రి..నిన్ను వదలా == పువ్వాడ అజయ్ జైలుకు పోవుడు ఖాయం
★★ మన ఇంటి పరిశరాలను ఎవరికి వారు పరిశుభ్రం చేసుకోవాలి.. ఇంటి అవరణంలో మురుగు నీరు, మంచినీరు నిల్వలేకుండా చూసుకోవాలి
★★ ఇంటి అవరణంలో కొబ్బరిబొండాలు, పాత టైర్లు, పాత ఇనప సామాగ్రి, పాత కుండలు, పగిలిపోయిన కుండలు, ప్లాస్టిక్ బాటిల్స్ లాంటివి లేకుండా, అందులో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి.
★★ పాత గాబుల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. కొత్త గాబుల్లో రెండు రోజులకోకసారి నీటిని క్లీన్ చేసుకోవాలి.
★★ ఇంటి ఎదురుగా ఉన్న వీధుల్లో చెత్తచేదారం లేకుండా చూసుకోవాలి. మన ఇంటి ముందు ఉండే డ్రైనేజీలను మనమే శుభ్రం చేసుకోవాలి. ఎవరో వస్తారని చూస్తే దోమలు చేరి వ్యాధుల ప్రభలడానికి అవకాశం ఉంటుంది.
★★ ఇంటి సమీపంలో పెరడు, పెంటకుప్పలు లేకుండా చూసుకోవాలి, ఇంటి అవరణంలో పిచ్చిమొక్కలు లేకుండా పరిశుభ్రత చేసుకోవాలి
★★ ఇంటి సమీపంలో కానీ ఇంటి అవరణంలో కానీ మురుగు నీరు ఉన్న, మంచినీరు నిల్వ ఉన్న వాటిలో కిరోసిన్ కానీ, కొబ్బరినూనే కానీ పోయండి.. మూడు రోజులకోకసారి ఇలా చేయండి
★★ జ్వరం వచ్చిన రోజునే సమీప ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకుంటే మంచిది. అలాగే జ్వరం వచ్చి మూడు రోజులైన తగ్గకపోతే కచ్చితంగా ప్రభుత్వాసుపత్రిలో పరీక్షలు చేయించండి.. త్వరగా ఆ వ్యాధిని నివారించే అవకాశం ఉంటుంది. మనిషికి ప్రాణహాని ఉండదు.

Allsoread-అమిత్ షాపై నిప్పులు చెరిగిన మంత్రి కేటీఆర్

◆◆  గ్రామాల్లో పంచాయతీ వారు చేయాల్సింది ఇవే..

★★  గ్రామంలో ఉన్న డ్రైనేజీలను పరిశుభ్రం చేయడం.. ప్రతి శుక్రవారం, మంగళవారం డ్రైడే నిర్వహించడం.
★★ మురుగు నీరు ఎక్కడ నిల్వ లేకుండా చర్యలు తీసుకోవడం
★★ ఖాళీస్థలాల్లో చెత్తచేదారం లేకుండా కంపచెట్లు లేకుండా తొలగించడం
★★ ఖాళీ స్థలాల్లో, ఇంటి పరసరాల్లో పాత టైర్లు, పాత కుండలు, పాత సామాగ్రి, కొబ్బరిబొండాలు,రోళ్లు, పాడుబడిన ప్లాస్టిక్ సామాన్లు, పాత గాబుల్లో మురుగునీరు నిల్వ ఉందేమో తనిఖీ చేయాలి.. వారికి నోటీసులు ఇవ్వాలి
★★ వారానికి ఒక సారి వాటర్ ట్యాంకర్లను శుభ్రం చేయాలి.

★★డెంగ్యూ, మలేరియా పట్ల ప్రజలను చైతన్యపర్చడం
ఇలా ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా పరిశరాలను పరిశుభ్రం చేసుకుంటే డెంగ్యూ, మలేరియా, చికిన్ గున్యా లాంటి మహామ్మారి వ్యాధులను నియంత్రణ చేసే అవకాశం ఉంటుంది. అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని ఇలాంటి పనులు చేస్తే బాగుంటుందని అనిపిస్తోంది.
◆◆ నివారణ చర్యలు చేపట్టండి : డాక్టర్ మాలతి, డీఎంఅండ్ హెచ్ వో
మే 16 తేదీన జరుగు డెంగీ నివారణ దినోత్సవంలో భాగంగా అన్ని ప్రాధమిక. పట్టణ ఆరోగ్య కేంద్రాలలో అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని డీఎంఅండ్ హెచ్వో డాక్టర్ మాలతి కోరారు .పారిశుధ్య నివారణే డెంగీ నివారణకు మార్గమని ప్రతి మంగళవారం మరియు శుక్రవారం డ్రైడే పాటించాలని తద్వారా దోమలు పుట్టకుండా చేసినట్లయితే డెంగీ వ్యాధిని నివారించ వచ్చని తెలిపారు. రానున్న వర్షాకాలంలో జిల్లా ప్రజలంతా పరిసరాల పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా దోమలు పుట్టకుండా చేయవచ్చునని దోమల వచ్చే వ్యాధులైన మలేరియా ,డంగీ ,చికున్గున్యా ,ఫైలేరియా మరియు మెదడువాపు లాంటి వ్యాధులు రాకుండా చేయవచ్చని తెలియజేసారు .కావున ప్రజలందరూ దోమల యెడల అప్రమత్తంగా ఉండాలని కోరారు. తప్పని సరిగా డ్రైడే పాటించాలని ,పరిసరాలలో నీరు నిల్వ లేకుండా చూడాలని యిండ్లలోని కూలర్లలోని నీటిని ఎప్పటి కప్పుడు మార్చుకోవాలని కోరారు .కొబ్బరి బొండాలు ,పూలకుండీలు ,టైర్లు రోళ్ళు ,పాడుబడిన ప్లాస్టిక్ సామానులలో నీరు నిల్వ లేకుండా చూడాలని ఈ విషయాలపై ప్రజలలో అవగాహన కల్పించాలని కోరారు. వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది కీటక జనిత వ్యాధులపై ప్రజలలో పూర్తి అవగాహన కల్పించాలని కోరారు
జ్వరము ,తలనొప్పి ,వళ్లునొప్పులు చర్మముపై ఎర్రటి దద్దురులు ఉంటె వెంటనే వైద్య సిబ్బందిని సంప్రదించాలని కోరార. అందరూ సమిష్టిగా కృషి చేసినట్లయితే కీటకాల ద్వారా వచ్చే వ్యాధులు రాకుండా చేయవచ్చని తెలియజేసారు. కావున మే 16 న జరుగు డెంగీ నివారణా దినోత్సవంను విజయవంతం జేయాలని కోరారు .