Telugu News

నేను అందరివాడిని.. ఆశీర్వదించండి: నామ

మళ్లీ గెలిపించండి.. సేవ చేసుకుంటా

0

నేను అందరివాడిని.. ఆశీర్వదించండి: నామ

== మచ్చలేని వ్యక్తిత్వం నాది

== మళ్లీ గెలిపించండి.. సేవ చేసుకుంటా

==  నామినేషన్ తర్వాత కలెక్టరేట్ మీడియా పాయింట్ లో మాట్లాడిన బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు,మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ , పార్టీ జిల్లా అధ్యక్షులు , ఎమ్మెల్సీ తాతా మధు, రాజ్యసభ సభ్యులు బండి పార్థసారధి రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యేలు

(ఖమ్మం ప్రతినిధి -విజయం న్యూస్)

ఖమ్మం జిల్లా రైతు బిడ్డను ..మీ వాడిని..25 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను.. రెండు సార్లు ఎంపీ గా ఆశీర్వదించి పార్లమెంట్ కు పంపించడంతో పార్లమెంట్ లో జిల్లా ప్రజా వాణి ని గొంతెత్తి వినిపించి, జిల్లా అభివృద్ధికి ఎంతో కృషి చేశానని బీఆర్ ఎస్ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి గా నామ బుధవారం నామినేషన్ దాఖలు చేసిన తర్వాత మీడియా పాయింట్ లో మాట్లాడారు.

ఇది కూడా చదవండి:- రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాల్..

మళ్లీ ఆశీర్వదించి పార్లమెంట్ కు  పంపించాలని కోరుతున్నానని తెలిపారు. తెలంగాణా బిల్లు పై మొదటి ఓటు వేసి తెలంగాణ సాధించిన దగ్గర నుంచి రాష్ట్ర విభజన సమస్యలు , ప్రాజెక్టులు, నిధులు, హక్కుల సాధనకు నిరంతరం శ్రమించానని నామ చెప్పారు. కేసీఆర్ ఆశీర్వదించి, బీఫామ్ ఇచ్చి, మీ వద్దకు పంపారు.. మళ్లీ మంచి మెజార్టీతో గెలిపిస్తే తెలంగాణా ప్రయోజనాలు కోసం పార్లమెంటు లో కొట్లాడతానని, జిల్లా గొంతుకను వెలుగెత్తి చాటుతానని చెప్పారు. మచ్చలేని వ్యక్తిత్వం ఉన్న తనను ఎవరూ వేలెత్తి చూపించలేని తనను మళ్లీ గెలిపించి, ప్రజలకు సేవా చేసే అవకాశం కల్పించాలని కోరారు. ఇంటి లో,ఆఫీసులో కుల, మతాలు, వర్గాల కతీతంగా అందర్నీ కలుపుకుపోయి పనులు చేశానని చెప్పారు. కేసీఆర్ 10 ఏళ్లలో రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ గా చేయడం జరిగిందని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాలు సాదించేందుకు మంచి మెజారిటీతో గెలిపించాల్సిన అవసరం ఉందని, అందరికీ అందు బాటులో ఉండే తనను ఆశీర్వదించాలని నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి:- బీఆర్ఎస్ అభ్యర్థి నామా నామినేషన్ 
విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ తాతా మధు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారధి రెడ్డి, జెట్పీ చైర్మన్ లింగాల కమలరాజు, మాజీ ఎమ్మెల్యే లు మెచ్చా నాగేశ్వరరావు, సండ్ర వెంకట వీరయ్య, తాటి వెంకటేశ్వర్లు, మదన్ లాల్, మేయర్ నీరజ, పట్టణ అధ్యక్షుడు పగడాల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.