నేనే రేడీ అంటున్న కోమటిరెడ్డి
== రేవంత్ తో నిన్న మొన్న ఆగ్రహం..నేడు చెవిలో గుసగుసలు
== రాష్ట్ర వ్యాప్తంగా చర్చాంశనీయంగా మారిన కోమటిరెడ్డి వ్యవహారం
(హైదరాబాద్-విజయంన్యూస్)
నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రాజకీయ వ్యవహారం ఎవరికి అర్థం కావడం లేదు.. ఆయన అడుగులు సస్పెన్షన్ గా మారిపోయాయి.. రాంగోపాల్ వర్మ సినిమా తరహాలో త్రిల్లింగ్ ప్రకటనలు చేస్తూ వస్తున్నారు.. నిన్నటి వరకు రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సీనియర్లకే సపోర్టు అంటూ ప్రకటనలు చేసిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. శుక్రవారం కొత్త తరహా నాయకుడిగా అవతారం ఎత్తాడు. రేవంత్ రెడ్డిపై కోపం తూచ్ అంటూ దోస్తుల వలే చేతిలో చేయ్యి వేస్తూ చెవిలో గుసగుసలాడుకుంటూ ఉండిపోయారు. అంతే కాదు రేవంత్ రెడ్డి చేపట్టే యాత్రకు నేను సైతం సిద్దమంటూ ప్రకటన చేయడంతో రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాఫిక్ గా మారిపోయారు. రేవంత్ రెడ్డి పీసీసీగా ఉన్నంత వరకు నేను గాంధీ భవన్ కు రాను అని చెప్పిన వెంకట్ రెడ్డి, ఏయే నేనేందుకు అన్న ఆ మాట గాంధీ భవన్ కాంగ్రెస్ నాయకులందరిది, అందుకే కాంగ్రెస్ నాయకుడిగా నేను వస్తా అంటూ ప్రకటన చేయడం చర్చాంచనీయంగా మారింది. మొత్తానికి గాంధీభవనంకు వచ్చిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇక నుంచి నేను సిద్దం అంటూ ప్రకటించారు.
ఇది కూడా చదవండి: భద్రాద్రి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు మృతి
కొంతకాలంగా గాంధీభవన్‌కు దూరంగా ఉంటున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎట్టకేలకు గాంధీభవన్ మెట్లెక్కారు. గాంధీభవన్‌కు రావడమే కాదు.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కాంగ్రెస్ లో ఇమడలేక, వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాల ఎజెండాతో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. మునుగోడు ఉప ఎన్నికతో రాష్ట్ర వ్యాప్తంగా ఆయన చర్చకు నిలిచారు. మునుగోడు ఉప ఎన్నికలో వెంకట్‌రెడ్డి ప్రచారానికి దూరంగా ఉన్నారు. అదే సమయంలో రేవంత్‌రెడ్డిని టార్గెట్‌చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కోమటిరెడ్డితో పాటు రేవంత్‌రెడ్డి టార్గెట్‌గా కాంగ్రెస్ సీనియర్ నేతలందరూ ఒక్కటై వేగంగా పావులు కదిపారు. నిన్నటి వరకూ రేవంత్ పేరు ఎత్తకుండా విమర్శలు చేసిన వారు.. ఇప్పుడు బాహాటంగానే ఆరోపణలు గుప్పిస్తున్నారు. అసంతృప్తి కాస్తా.. అసమ్మతిగా మారింది. ముఖ్యంగా మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఓటమి తర్వాత రేవంత్‌పై విమర్శల దాడి పెరగ్గా.. టీపీసీసీ కమిటీల కూర్పు దానికి మరింత ఆజ్యం పోసింది. టీడీపీ నుంచి వలస వచ్చిన నేతలకు ప్రాధాన్యం ఇచ్చారంటూ సీనియర్ నేతలందరూ మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ కాంగ్రెస్‌కు ఇన్‌చార్జిగా మాణిక్ రావ్ ఠాక్రే ను ఆ పార్టీ అధిష్టానం నియమించింది.
ఇది కూడా చదవండి: పొంగులేటి కాంగ్రెస్ కు రండీ..:భట్టి
తెలంగాణ కాంగ్రెస్‌లో ఉన్న అసంతృప్తులను చల్లార్చేందుకు ఆయన గాంధీభవన్ లో కాంగ్రెస్ నేతలతో సమావేశయ్యారు. ఈ నెల 26 నుంచి కాంగ్రెస్ చేపట్టనున్న హాత్ సే హాత్ జోడో అభియాన్ కార్యక్రమానికి పార్టీ నేతలు, అనుబంధ సంఘాలను పూర్తిగా సమాయత్త పర్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందుకు సంబంధించి ప్రచారం, ఎన్నికల నిర్వహణ, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీలతో గాంధీభవన్‌లో మాణిక్ రావ్ విడివిడిగా భేటీ అయ్యారు. రేవంత్‌రెడ్డి, ఇంచార్జి కార్యదర్శులతో సమావేశమయ్యారు. శనివారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు టీపీసీసీ విస్తృత కార్యవర్గ సమావేశంలో పాల్గొంటారు. సాయంత్రం మహిళా కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ, సేవాదళ్, యూత్ కాంగ్రెస్, ఐఎన్‌టీయూసీ కార్యవర్గాలతో విడివిడిగా సమావేశమవుతారు.