


ఇదే సందర్భంలో ఆయిల్ పామ్ , ఇతర నూనె గింజల రైతులను ప్రతికూలంగా ప్రభావితం చేస్తున్న క్రూడ్ పామ్ ఆయిల్ ( సీపీవో ) యొక్క సుంకం రహిత దిగుమతి గురించి నామ దృష్టికి తీసు కొచ్చారు.ఎఫ్‌ఎఫ్‌బీ ధర 2022 మే నెలలో టన్నుకు రూ. 23,635/- తగ్గిందన్నారు. సెప్టెంబరు 2022 నాటికి రూ. 13,000/ – కు ధరలు తగ్గిన ఫలితంగా తీవ్రంగా నష్టపోయినట్లు తెలిపారు. 2019-20లో 49 శాతం ఉన్న దిగుమతి సుంకాలు ఏప్రిల్ 2022 నాటికి జీరో చేయ బడ్డాయని, దీనికి తోడు ఎరువుల ధరలు భారీగా పెరగడంతో పాటు ధరలు భారీగా తగ్గినప్పటికీ దేశీయ రైతులను రక్షించడానికి ఎటువంటి దిగుమతి సుంకాలు విధించబడలేదని రైతు ప్రతినిధులు నామకు తెలిపారు. సీపీవో ధర కోసం దిగుమతి సుంకాన్ని కొనసాగించాలన్నారు.రూ. 1,20,000/- ద్వారా ఆయిల్ పామ్ , ఇతర నూనెగింజల పంటల సాగు ఖర్చు కవర్ చేయబడుతుందని చెప్పారుదిగుమతి సుంకాలను నియంత్రించడానికి, దేశీయ రైతులను అనవసరమైన విదేశీ పోటీ నుండి రక్షించడానికి “డైనమిక్ ఇంపోర్ట్ డ్యూటీ మెకానిజం”ను రూపొందిం చేలా కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి తీసుకురావాలని నామను కోరారు.