Telugu News

నేను పక్కా లోకల్: నామా నాగేశ్వరరావు 

తిమ్మారావుపేట లో ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు రోడ్డు షోకు జనం, పార్టీ కార్యకర్తలు నీరాజనం

0

నేను పక్కా లోకల్: నామా నాగేశ్వరరావు 

➡️ మీ వాడిని ఆదరించండి..

➡️ తిమ్మారావుపేట లో ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు రోడ్డు షోకు జనం, పార్టీ కార్యకర్తలు నీరాజనం

(ఖమ్మం ప్రతినిధి -విజయం న్యూస్)

నేను పక్కా లోకల్.. మీలో ఒకడిని… మీ వాడిని…అందరివాడిని అక్కున చేర్చుకోండి… ఆదరించండి… నాకు ఓటు వేసి గెలిపించండి..మీకు నేను అన్ని విధాలా అండగా ఉండి ఐదేళ్లు కాపాడుకుంటానని బీఆర్ ఎస్ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి నామ నాగేశ్వరరావు అన్నారు. ఏన్కూరు మండలం తిమ్మారావుపేట లో శనివారం రాత్రి జరిగిన రోడ్డు షోకు ప్రజలు, కార్యకర్తలు ఉవ్వెత్తున హాజరై నీరాజనం పలికారు.నామ ను అక్కున చేర్చుకున్నారు.

ఇది కూడా చదవండి:- యుద్దబేరి మొదలైంది..విజయం మనకే వస్తుంది: పువ్వాడ

ఈ సందర్భంగా నామ మాట్లాడుతూ రెండు సార్లు ఆశీర్వదించి పార్లమెంట్ కు పంపిస్తే తెలంగాణ ప్రయోజనాలు కాపాడడం తో పాటు పార్లమెంట్ సాక్షిగా జిల్లా ప్రజల సమస్యలపై గళం విప్పి, సాధించానని చెప్పారు. ఎంపీలందరికంటే ఎక్కువ రోజులు పార్లమెంట్ కు హాజరై ఎక్కువ ప్రశ్నలు అడిగి, ఉత్తమ పార్లమెంటేరియన్ గా గుర్తింపు తెచ్చుకుని, జిల్లా ప్రజల గౌరవాన్ని దేశ స్థాయిలో పెంచానని అన్నారు.మళ్లీ ఇప్పుడు గెలిపించి పార్లమెంట్ కు పంపితే మరింత అభివృద్ధి చేస్తానని చెప్పారు. రాజకేయాల్లోకి రాకముందు నుంచే జిల్లా ప్రజలతో అనుబంధం ఉందన్నారు . పాల్వంచలో టెన్త్ వరకు, కొత్తగూడెంలో ఇంటర్ చదువుకున్నానని,తన తండ్రి నామ ముత్తయ్య పేరుతో ట్రస్ట్ పెట్టి పేదలు, బడుగు బలహీన వర్గాల వారికి సేవా కార్యక్రమాలు చేశానని చెప్పారు. పిలిస్తే పలికే లోకల్ వాడినని, ఆశీర్వదించాలని అన్నారు. సంపాందించిన దానిలో కన్న బిడ్డలకు పెట్టుకున్నట్లు ప్రజల పెట్టుకుని, నిత్యం వారితో 30 ఏళ్లుగా మమేకమై ఉన్నానని అన్నారు.

 ఇది కూడా చదవండి:- ఈ ఎన్నికల్లో చరిత్ర తిరగరాయాలి: ఎంపీ నామా

ప్రతి ఒక్క కార్యకర్త నామనే అనుకుని గడప గడపకు వెళ్లి తలుపు తట్టి, కేసీఆర్ చేసిన అభివృద్ధి, సంక్షేమం గురించి వివరించి , కాంగ్రెస్ మోసాన్ని ఎండగట్టి, ప్రజలతో కలిసి పోవాలని అన్నారు.ఈ
కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ ఇంచార్జి బాణోత్ మదన్ లాల్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, మండల, గ్రామ నాయకులతో పాటు జెట్పీటీసీ, ఎంపీటీసీ, తదితరులు పాల్గొన్నారు.