Telugu News

సీఎం కేసీఆర్ పై పోటీకి నేను సిద్దం: పొంగులేటి 

బీజేపీ నాయకులు ఆహ్వానించారు.. ప్రజల నిర్ణయమే నా నిర్ణయం

0

సీఎం కేసీఆర్ పై పోటీకి నేను సిద్దం: పొంగులేటి 

== ఖమ్మం నుంచి పోటీ చేస్తానంటే నేను రేడీ

== బీజేపీ నాయకులు ఆహ్వానించారు.. ప్రజల నిర్ణయమే నా నిర్ణయం

== రాష్ట్ర ప్రజల కోసమే మేము పార్టీ వీడాం

== విలేకర్ల సమావేశంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

సీఎం కేసీఆర్ పై పోటీ చేసేందుకు నేను సిద్దంగా ఉన్నానని, ఆయన ఖమ్మం నుంచి పోటీ చేస్తే ఎవరి ప్రమేయం లేకుండా నేను పోటీ చేసేందుకు రెఢీ అని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఖమ్మం ప్రజలపై నాకు విశ్వాసం ఉందని, ఎవరు గెలుస్తారో తెల్చుకుందామని పొంగులేటి సవాల్ చేశారు.

ఇది కూడా చదవండి: పొంగులేటి లక్ష్యం కేసీఆర్ ను దించుడే: ఈటెల

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని బీజేపీ పార్టీలోకి ఆహ్వానించేందుకు గాను హైదరాబాద్ నుంచి ఖమ్మంలోని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసానికి  ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వరరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి క్రిష్ణారావులు  వచ్చారు. పొంగులేటి నివాసానికి వెళ్లిన వారు డిన్నర్ చేశారు. అనంతరం సుమారు రెండు గంటల పాటు చర్చలు జరిపిన అనంతరం బయటకు వచ్చిన  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ ముఖ్య నాయకులు మా నివాసానికి వచ్చారని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రం వస్తె రాష్ట్ర ప్రజలకు మంచి జరుగుతుంది అనుకున్నామని, కానీ సీఎం కెసిఆర్ ఈ అంశాలను తుంగలో తొక్కారని విమ్మర్శించారు. బీజేపీ చేరీకల కమిటీ  బీజేపీలోకి రావాలని ఆహ్వానించారని, గతంలో, ఇప్పుడు ఢిల్లీ పెద్దలు పార్టీలోకి రావాలని ఆహ్వానించారని తెలిపారు. రాష్ట్ర ప్రజల కోసమే మేము పార్టీ వీడామని, ప్రజల ఆశయాలను నెరవేర్చే క్రమంలోనే మేము తీసుకునే నిర్ణయాలు కట్టుబడి ఉంటాయని అన్నారు.

ఇది కూడా చదవండి: పొంగులేటి సింహం..సింగిల్ గానే వస్తుంది: స్వర్ణకుమారి 

ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామిని కూడా అమలు చేయడం లేదని, మాటల గారడితో మాయలు చేస్తూ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని ఆరోపించారు. సీఎం కెసీఆర్ మూడవ సారి అధికారంలోకి వస్తారని సంకలు కొట్టుకుంటున్నారని, ఎట్టిపరిస్థితుల్లో మూడవ సారి గెలవనిచ్చేదే లేదన్నారు. దాని కోసం దేనికైనా సిద్దంగా ఉన్నామని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ విజయాన్ని అడ్డుకోవడమే మా లక్ష్యమని, ఆ సత్తా ఎవరికి ఉంటుందో వారితో కలిసి పనిచేస్తామన్నారు. సీఎం కెసిఆర్ ను గద్దె దించేందుకు శక్తి ఉన్న పార్టీకి మేము మద్దతుగా ఉంటామని తెల్చి చెప్పారు. యావత్ తెలంగాణ బిడ్డల ఆలోచనలకు అనుగుణంగానే పార్టీలో చేరుతానని, వారి నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తానని హామినిచ్చారు. ఎవరో ఏదో అంటుంటారు వారు అధికారంలో ఉన్నారు కదా అని ఎగురుతున్నారని, మరో మూడు నెలల్లో బిస్తరు సర్దేయడమేనని జోస్యం చెప్పారు. సీఎం కెసిఆర్ ఖమ్మం నియోజకవర్గం నుండి పోటీ చేస్తే ఆయనపై పోటీకి నేను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. మా అజెండా ఒక్కటే సీఎం కెసిఆర్ ను ఇంటికి పంపడమేనని,  దాని కోసమే మేము ఎదైనా నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. కేవలం చర్చలు మాత్రమే జరిగాయని, పదవుల గురించి చర్చ జరగలేదన్నారు.