Telugu News

నేను శీనన్న వెంటే: కోరం కనకయ్య

నేడు భారీ సమ్మేళనం

0

నేను శీనన్న వెంటే…స్పష్టం చేసిన కోరం కనకయ్య

== ఆయన శక్తి బీఆర్ఎస్ కు తెలియదు

== ఇల్లెందు ఎవరి సొత్తుకాదంటున్న కోరం

== నేడు భారీ సమ్మేళనం

== స్వచ్ఛందంగా తరలివస్తున్న అభిమానులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు

== అడ్డుకునేందుకు అనేక ప్రయత్నాలు

 (ఇల్లెందు-విజయం న్యూస్)

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెంటే నేను ఉంటానని మాజీ ఎమ్మెల్యే, భద్రాద్రికొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య స్పష్టం చేశారు. సోమవారం ఇల్లందు పట్టణ శివారులో పొంగులేటి ఆత్మీయ సమ్మెళనం కార్యక్రమం నిర్వహిస్తున్న క్రమంలో ‘విజయం’ తెలుగు దినపత్రికలో ‘బీఆర్ఎస్ కు కోరం గుడ్ బై’ కథనం రాయగా, ఆ కథనానికి అనూహ్య స్పందన లభించింది. ఉన్నది ఉన్నట్లు, విన్నది విన్నట్లుగా కథనం రాశారని వందలాధి మంది విజయం పత్రిక ప్రతినిధులకు పోన్ చేసి అభినందనలు తెలిపారు. ఈ క్రమంలో కోరం కనకయ్య విజయం ప్రతినిధితో మాట్లాడి పార్టీ మార్పు, రాజకీయ భవిష్యత్, పొంగులేటి ఆత్మీయ సమ్మెళన పర్యటన వివరాలను వెల్లడించారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శక్తి బీఆర్ఎస్ పార్టీకి తెలియదని, ఆయన ఓ హనుమంతుడని అన్నారు.

ఇది కూడా చదవండి: బీఆర్ఎస్ కు కోరం గుడ్ బై..?

ఆయన శక్తి ఎంటో బీఆర్ఎస్ నాయకులు కనిపెట్టలేకపోయారని, తెలిసిన తెలియనట్లే నటించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాలాంటి గిరిజన పుత్రులకు అండగా పేదప్రజలకు పెద్దన్నగా నిలుస్తున్నారని, ఊ అంటే ఉమ్మడి జిల్లా ఏకపక్షంగా పొంగులేటి వైపు పయనించే అవకాశాలున్నాయని కోరంకనకయ్య స్పష్టం చేశారు. నేను కూడా ప్రస్తుత పరిస్థితులలో  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని నమ్ముకుని రాజకీయం చేస్తన్నానని, ఆయన ఏ పార్టీలోకి వెళ్లిన ఆయన వెంటనే ఉంటాని, ఆయనతో వెళ్లిపోవడానికి నేను సిద్దంగా ఉన్నానని స్పష్టం చేశారు. నాకు రాజకీయాలు ముఖ్యం కాదని, నమ్ముకున్న వ్యక్తిని మోసం చేయొద్దు అనే ఏకైక లక్ష్యంతో అడుగులేస్తున్నానని అన్నారు. అదేవిధంగా గత నాలుగేళ్లలో ఇల్లందు నియోజక వ్యాప్తంగా తనను అవమానించే పనులు చేశారని, అలాగే నా అభిమానులు, తన  వర్గీయులు, కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులకు గురిచేశారని, ఇబ్బందులు పడ్డారని అన్నారు. మా కార్యకర్తలను బ్లాక్మెయిలింగ్ టార్గెట్ రాజకీయాలు చేస్తూ వారిని ఎంతో ఇబ్బందులకు గురి చేశారని చెప్పారు. పొంగులేటి ఎటువైపు వెళ్లిన కండ్లు మూసుకుని వెళ్తానని, ఆయన వెంట ఉంటే ఒక భరోసా ఉంటుందన్నారు. ఆయన రాబోయే రోజుల్లో కచ్చితంగా తనను గెలిపించి తీరుతారని చెప్పారు.

== నేడు  పొంగులేటి ఆత్మీయ సమ్మెళనం

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఇల్లెందు నియోజకవర్గంలో పొంగులేటి ఆత్మీయ సమ్మెళనం కార్యక్రమాన్ని ఈనెల 23న ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నరని తెలిపారు. ఎప్పుడు జరగనంతగా కనివిని ఎరగని రీతిలో ఈ ఆత్మీయ సమ్మెళనం కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి పొంగులేటి,  కోరం కనకయ్య అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యే అవకాశం ఉంది.  ఇల్లందు నియోజకవర్గంలోని ఐదు మండలాలతో పాటు ఇల్లెందు మున్సిపాలిటీ నుండి వేలాది మంది జనం హాజరయ్యేందుకు సిద్ధమవుతున్నారు. నేడు 12 గంటలకు సమ్మేళనం ప్రారంభమై ఒంటిగంటకు ముగుస్తుందని తెలిపారు.

== ఇల్లెందు ఎవరి సొత్తు కాదు                          ఇది కూడా చదవండి: ఇల్లందులో కింగ్ మేకర్ ‘మడత’

          ఇల్లెందు ఎవరు సొత్తు కాదని, ఇక్కడ ప్రజల సొత్తు అని, అది నిరూపించేందుకు భారీ సమ్మేళనం ఏర్పాటుకు రూపకల్పన చేశామని కోర కనకయ్య తెలిపారు. .స్థానిక ప్రజా ప్రతినిధులతో పాటు అభిమానులు బిఆర్ఎస్ కార్యకర్తలు కార్యకర్తలు స్వచ్ఛందంగా సమయుతమయ్యారు. ఇల్లందు మండలం లలిత పురం వద్ద భారీ ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు.కోరం శీనన్నకు సంబంధం లేకుండానే ఏర్పాట్లు చేయడం విశేషం.ఈ ఆత్మీయ సమ్మేళనానికి పెద్ద ఎత్తున నియోజకవర్గ వ్యాప్తంగా అభిమానులు, కార్యకర్తలు, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సొసైటీ డైరెక్టర్లు హాజరై అవకాశం ఉంది.అంతేకాదు కనివిని ఎరగని రీతిలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు.

– విఫలం కోసం అనేక ప్రయత్నాలు?

ఆత్మీయ సమ్మేళనం విఫలం కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.స్థానిక ప్రజా ప్రతినిధులను వెళ్లకుండా ఆంక్షలు విధిస్తున్నారు.అయినప్పటికీ స్వచ్ఛందంగా వెళ్లేందుకు నియోజకవర్గ వ్యాప్తంగా స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు శీనన్న కోరం అభిమానులు బీఆర్ఎస్ కార్యకర్తలు సిద్ధమవుతున్నారు.గార్ల, బయ్యారం, కామేపల్లి, టేకులపల్లి, ఇల్లెందు మండల, పట్టణాల నుండి భారీ ఎత్తున హాజరై అవకాశం ఉంది.

-== పోటాపోటీగా మరో సమ్మేళనం                     ఇది కూడా చదవండి:  జిల్లాలో ఓ కుటుంబ కుల బహిష్కరణ

కోరం కనకయ్య నిర్వహిస్తున్న భారీ సమ్మేళనానికి పోటాపోటీగా ఇల్లందు మున్సిపాలిటీ మూడు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా పాలకవర్గం నేతృత్వంలో మరో సమ్మేళ నిర్వహిస్తున్నారు.ఇల్లెందు మార్కెట్ యార్డ్ వేదికగా సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నారు.కేవలం కోరం సమ్మేళనాన్ని విఫలం చేసేందుకే ఈ సమ్మేళనాన్ని ఏర్పాటు చేస్తున్నారని కోరం కనకయ్య అభిమానులు మండిపడుతున్నారు. నేడు ఏం జరుగుతుందో ఎవరి బలబలాలు తేలుతాయో వేచి చూడాలి.