Telugu News

నెల్లిపాక సోసైటీలో అక్రమాలు

ఒంటరి నిర్ణయాలు తీసుకుంటున్న నెల్లిపాక సొసైటీ చైర్మన్.

0

నెల్లిపాక సోసైటీలో అక్రమాలు

== నేనే రాజు.. నేనే మంత్రి అంటున్న చైర్మన్

== ఒంటరి నిర్ణయాలు తీసుకుంటున్న నెల్లిపాక సొసైటీ చైర్మన్.

 == చైర్మన్ పై పాలకవర్గ డైరెక్టర్ల మండిపాటు.

== సంఘం డబ్బులు తన సొంతగా వాడుకున్నట్టు ఆరోపణలు.

== చైర్మన్ ఇంటి వద్దనే సంఘంలోని రికార్డ్స్

అశ్వాపురం, ఫిబ్రవరి 28, (విజయం న్యూస్)

నెల్లిపాక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ తుక్కని మధుసూదన్ రెడ్డి సంఘంలో చేసిన తీర్మానాలకు కట్టుబడి ఉండకుండా తను ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడని డైరెక్టర్లు మంగళవారం సొసైటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అన్నారు. ఈ సందర్భంగా పిఎసిఎస్ వైస్ చైర్మన్ కమటం సురేష్ మాట్లాడుతూ సొసైటీ చైర్మన్ తుక్కాని మధుసూదన్ రెడ్డి సంఘంలో చేసిన తీర్మానాలకు కట్టుబడి ఉండకుండా తన ఇష్టానుసారంగా వ్యవహరించడమే కాకుండా సొసైటీ మినిట్ బుక్ అధికారికంగా సీఈఓ దగ్గర లేకుండా తన ఇంట్లో పెట్టుకుని ఏం చేసుకుంటారో చేసుకోండి?

ఇదికూడా చదవండి: గ్రామ పంచాయతీ టాంకర్ దుర్వినియోగం

నా ఇష్టం అనే రీతిలో వ్యవహరిస్తున్నాడని, 2021- 22 ఆడిట్ చేయగా అందులో రూ 20,06,252 లక్షల కు సంబంధించిన వ్యవహార అవకతవకల గురించి చైర్మన్, సీఈవో చేరో రూ 5 లక్షల చొప్పున కట్టాలని వాటిని కట్టడానికి 15 రోజులు గడు విధించిన గాని డబ్బులు కట్టక పోగా డైరెక్టర్లు సొసైటీ ఆఫీస్ కి రాగా వారిని చూసి చైర్మన్ సమాధానం చెప్పకుండా అక్కడి నుండి వెళ్లిపోయాడని అన్నారు. పాలకవర్గం లేకుండా సంస్థలోని డబ్బులను తన సొంత ఖర్చులకు వాడుకోవడం జరుగుతుందని, ఈ పాలకవర్గంలో ఎన్నో తీర్మానాలు చేసిన గాని ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదని, ఇకనైనా చైర్మన్ పాలకవర్గం, రైతులు పట్ల జాగ్రత్త వహించి తన వైఖరి మార్చుకోవాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ కమటం సురేష్, డైరెక్టర్లు కాసర బాధ సందీప్, సామ వెంకట్ రెడ్డి, కోడి వెంకన్న, ఎమ్ బి రామకృష్ణ, తైదల నరసయ్య, కురుసం లక్ష్మణ్ స్వామి పాల్గొన్నారు.

ఇదికూడా చదవండిం నేను తలుచుకుంటే..? అడుగుపెట్టగలవా రేవంత్ :రేగా