మీమ్మల్ని బిచ్చగాళ్లను చేయలేను:తుమ్మల
== పదిమందికి దానం చేసేస్థాయికి ఎదగాలనేదే నాలక్ష్యం
== కాంట్రాక్టర్లను పీడించే సంస్కృతి నాది కాదు
== అధికారాన్ని స్వార్థం కోసం వాడుకుంటున్నారు
== మండిపడిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
(కూసుమంచి-విజయంన్యూస్)
దాన ధర్మాలతో ప్రజలను బిచ్చగాళ్ల లాగా నేను చూడలేను, ప్రజలే పదిమందికి దానం చేసే పరిస్థితికి తేవాలనేదే నాలక్ష్యమని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. పాలేరు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా కూసుమంచి మండలంలోని మునిగేపల్లి గ్రామంలో కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఇది కూడా చదవండి:-తుమ్మల.. దమ్ముంటే నా మీద పోటీ చేయ్:కందాళ
ఎక్కడో బార్ షాపుల దగ్గర, కాంట్రాక్టర్లను పీడించే సంస్కృతి నాది కాదని అన్నారు. ఎప్పుడు ఎవరు చస్తారా అని చూసే రకాన్ని నేను కాదని ఆరోపించారు. ఎన్టీఆర్ మంత్రివర్గంలో చిన్నవయస్సులోనే మంత్రిగా పనిచేసే అవకాశం వచ్చిందని, అప్పటి నుంచి మొన్నటి వరకు కూడా ప్రజల శ్రేయస్సు కోరకే పనిచేశానని, ఏనాడు కూడా నా వ్యక్తిగత స్వార్థం కోసం పనిచేయలేదని అన్నారు. ప్రజల సమస్యలను గుర్తించి, ప్రజలు అడగకుండానే ఆ పనులను పూర్తి చేసే వారే నిజమైన నాయకుడవుతారని అన్నారు.
ఇది కూడా చదవండి:- నిగ్గదీస్తే దాడి చేస్తారా…?: పొంగులేటి
అక్కడిక్కడ వసూళ్లు చేసి పైసలిస్తూ బిచ్చగాళ్లను చేయలేనని, ప్రజలను మెప్పించి మెప్పు పొందాలనే, అభివద్ది పనులను పూర్తి చేసి ప్రజల సంతోషాన్ని చూస్తానని అన్నారు. నా లక్ష్యం, నా ఆశయం ఒక్కటేనని, గోదావరి జలాలను పాలేరు కు తీసుకరావడం, గోదావరి నీళ్లతో మీ అందరి కాళ్లు కడగటమే నా లక్ష్యమన్నారు. గోదావరి నీళ్లు వచ్చే వరకు నేను రాజకీయాల్లో ఉంటానని అన్నారు. ప్రజలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా ఎడగాలనేది నా కోరిక అని అన్నారు. పార్టీలోకి వచ్చిన తరువాత అందరూ మనవాళ్లే అనుకుని పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తానని అన్నారు. కొందరు అధికారాన్ని వాళ్ళ స్వార్థం కోసం, అధికార యంత్రాంగన్నీ వాడుకొంటున్నారని, అటువంటి వారికి తిలోదకాలు ఇచ్చేటందుకి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. అహంకారం తో చేసే పనులకు కాంగ్రెస్ పార్టీ అడ్డుకట్ట వేస్తుందన్నారు. ఐదు సంవత్సరాలు పదవిలో ఉండి ప్రజలను పీడించుకు తిన్నారని ఆరోపించారు.
ఇది కూడా చదవండి:-;నువ్వేదో పొడుస్తావని నిన్ను గెలిపించలేదు: పొంగులేటి
కార్యకర్తల కు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెల్చి చెప్పారు. . పదవులు ఎవ్వరికీ శాశ్వతం కాదన్నారు. పదవులలో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే మనకు పుట్టగతులు ఉండవనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. తెలంగాణ ప్రాంతం ఎవడి జాగీరు కాదన్నారు. నా రాజకీయ జీవితం మొత్తం జిల్లా అభివృద్ధికి అంకితమిస్తాను… ప్రజల కళ్ళలో ఆనందం కోసమే నేను పని చేస్తానని హామినిచ్చారు. ఈ జిల్లా నే కాదు రాష్ట్ర వ్యాప్తంగా నా శక్తీ మేరకు పని చేస్తానని, కచ్చితంగా కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేస్తానని హామినిచ్చారు.
ఇది కూడా చదవండి:-;‘పాలేరు’ నుంచి తుమ్మల పోటీ చేయాలి