Telugu News

నేను బ్రతక లేక రాజకీయాలు చేయట్లేదు:కందాళ

క్యాంప్ కార్యాలయంలో సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి

0

నేను బ్రతక లేక రాజకీయాలు చేయట్లేదు:కందాళ

== నా ప్రజలకు ఏదో ఒక సహాయం చేయాలనే రాజకీయాలు చేస్తున్నాను 

== క్యాంప్ కార్యాలయంలో సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి

(ఖమ్మం రూరల్ -విజయం న్యూస్)

✍️ఖమ్మం సాయి గణేష్ నగర్ క్యాంప్ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకులు,కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన *శ్రీ కందాళ ఉపేందర్ రెడ్డి గారు* ఈసందర్భంగా మాట్లాడుతూ ఇక 2రోజులు మాత్రమే మిగిలుంది మనమందరం కలిసికట్టుగా ముందుకు సాగుతూ బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి *శ్రీ నామ నాగేశ్వరరావు గారిని* అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలి.గత కొన్ని రోజులుగా గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తున్న నాయకులకు,కార్యకర్తలు,గులాబీ శ్రేణులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.అన్ని వర్గాల ప్రజలు తాము పడుతున్న కష్టాలను తీర్చేది కేసీఆర్,బీఆర్ఎస్సే అని భావిస్తున్నారు.గత ఎన్నికల్లో జరిగిన పొరపాటు సరిదిద్దుకునే సరైన సమయం రానే వచ్చింది.పార్లమెంట్ ఎన్నికలోనైన కారు గుర్తుకు ఓటు వేస్తే నాకు ఓటు వేసినట్టే అని ప్రజలందరికి తెలియజేయండి.
✒️ఈ సమావేశంలో ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ తాత మధుసూదన్ గారు,నియోజకవర్గ సమన్వయకర్త తాళ్ళూరి జీవన్ కుమార్ గారు పాల్గొన్నారు.