Telugu News

అమ్ముడు పోయే సరుకు నాకు అవసరం లేదు: మంత్రి

42, 52వ డివిజన్ లలో ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పువ్వాడ..

0

అమ్ముడు పోయే సరుకు నాకు అవసరం లేదు: మంత్రి

== నికార్సుయిన సరుకు చాలు

== 42, 52వ డివిజన్ లలో ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పువ్వాడ..

(ఖమ్మం ప్రతినిధి -విజయం న్యూస్)

ఖమ్మం నగర ప్రజల కోసమే రాజకీయాల్లో ఉన్నానని అమ్ముడు పోయే సరుకు నాకు అవసరం లేదని… నాకు నికర్స్సైన సరుకు మాత్రమే చాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.

ఇది కూడా చదవండి:-;నాది స్వరజన మతం.. నేను అందరి వాడను:మంత్రి పువ్వాడ 

▪️ఖమ్మం నగరం 42వ డివిజన్ నిజాంపేటలో మైనార్టీ నాయకులు శంషుద్దిన్, ముజాహిద్, నయిం, షబ్బీర్ మజీద్ అధ్వర్యంలో ఎర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం…

▪️52వ డివిజన్ మైనార్టీ నాయకుడు ఫకృద్దిన్ అధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొని మాట్లాడారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అందుకే వేల కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి అభివృద్ది చేశానని అన్నారు.

ఖమ్మం నగరాభివృద్ధి కోసం నేను చేసిన కష్టం మీకు తెలుసని అన్నారు.

మీ కష్టంలో కాంగ్రెస్ వాళ్లు ఏనాడైనా వచ్చారా..? మీరు ఆపదలో ఉన్నపుడు ఎవరైనా మిమ్మల్ని పలకరించారా.. నేను వచ్చిన.

మీ ప్రతి కష్టంలో నేను ఉన్న. పెళ్లి అయినా.. చావు అయినా.. మరే ఇతర కార్యక్రమం అయిన నేను వచ్చిన.. నేను ఉన్న మీకు తోడుగా ..

ఇది కూడా చదవండి:- పార్టీ శ్రేణుల్లో జోష్ నింపడానికే బైక్ యాత్ర:మంత్రి

అమ్మలూ, అన్నలు చెప్పాలి మీరే.. కరోనా సమయంలో ఏమయ్యారు వెళ్ళంత.. కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల ఏమైండు.. ఆ నాడు రాలేదేం..

ఇప్పుడు వచ్చి ప్రజల మీద ప్రేమ కురిపిస్తున్నాడు.. మున్నేరు వరద సమయంలో కంటికైనా కనిపించాడా.

ప్రాణ భయంతో హైద్రాబాద్ లో ఏసీ గదుల్లో భద్రంగా దాక్కున్నారు.. ఇప్పుడు అతన్ని గెలిపిస్తే మళ్ళీ ఇక్కడ ఉండదు.. రాత్రి అయితే హైద్రాబాద్ కానీ, సత్తుపల్లి కానీ వెళ్ళిపోతాడు.

కాబట్టి ప్రజలారా ఆలోచన చేయండి.. మీ కోసం నిలబడిన వ్యక్తిని ఎన్నుకోండి..

ఎంత అభివృద్ది చేసినా ఎన్నికల సమయంలో వచ్చి ఇక్కడ విష ప్రచారం చేసి ప్రజలను మభ్యపెడుతున్నారని ద్వజమెత్తారు.

ఇది కూడా చదవండి:-;బతుకమ్మ మన పూల పండగ: మంత్రి పువ్వాడ

నన్ను ఖాసిం రజ్వీతో పోల్చడం విచారకరం.. ఎవరికైనా అన్యాయం చేశానా.. ఎవరినైనా ఇబ్బంది పెట్టిననా.. కేవలం విష ప్రచారం చేసి నాపై బురద జల్లాలని చూస్తున్నారు.

ఇక్కడ అన్ని కులాలను, మతాలకు సమన్యాయం చేసి అన్ని వర్గాలను అక్కున చేర్చుకుని వారికి అన్ని పథకాలు అందజేసి న్యాయం చేసా..

గంగా, జమున, తేహజీబ్ లాగా పని చేసి మీ అందరి మన్ననలు పొందిన వాడిని.

మీ అజయ్ అన్నని సాదుకొండి.. కాపాడుకుండి.. ఇప్పుడు చేసిన అభివృద్ధికి ఐదు ఇంతలు అభివృద్ది చేసి చూపిస్తా..

వచ్చే ఎన్నికల్లో BRS పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు

కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ, డిసిసిబి చైర్మన్ కురాకుల నాగభూషణం, మాజీ గ్రంధాలయ చైర్మన్ ఖమర్, కార్పొరేటర్ మక్బూల్, మాజీ కార్పొరేటర్ షౌకత్ అలీ, ఇస్సాక్, మజీద్, బబ్లు, బద్రి, గురుమూర్తి, లింగరాజు, నాని, BRTU నాయకులు పాషా, షబ్బీర్,

ఇది కూడా చదవండి:- తెలంగాణలో హ్యట్రిక్ విజయం తథ్యం:మంత్రి

52వ డివిజన్ మైనార్టీ నాయకుడు ఫకృద్దిన్ అధ్వర్యంలో జరిగిన సమ్మేళనంలో Dr. పువ్వాడ నరేన్, డిసిసిబి ఛైర్మన్ కురాకుల నాగభూషణం, టౌన్ పార్టీ ప్రెసిడెంట్ పగడాల నాగరాజు, AMC చైర్మన్ దోరేపల్లి శ్వేత, కార్పొరేటర్ బుర్రి వెంకట్ కుమార్, డివిజన్ అద్యక్షుడు బత్తుల తిరుమల రావు, సూత్రాల శ్రీనివాస్, బుర్రి ఇందిర తదితరులు ఉన్నారు.