Telugu News

నేను సీఎం కేసీఆర్ ను కలవాలి.. నన్ను వదలండి : జేసీ హల్ చల్

== ప్రగతిభవన్‌ వద్ద మాజీమంత్రి జెసి హల్‌చల్‌

0

నేను సీఎం కేసీఆర్ ను కలవాలి.. నన్ను వదలండి : జేసీ హల్ చల్
== ప్రగతిభవన్‌ వద్ద మాజీమంత్రి జెసి హల్‌చల్‌
== సిఎం కెసిఆర్‌ను కలవాలంటూ హంగామా
== అనుమతి లేకపోవడంతో అనుమతించని పోలీసులు
(హైదరాబాద్‌-విజయంన్యూస్)
ఆయనోక మాజీ మంత్రి.. సీనియర్ నాయకుడు.. చట్టాలు.. రాజకీయాలు తెలియని వ్యక్తి కాదు.. సీఎంలను కలవాలంటే ఏం చేయాలో కూడా ఆయనకు తెలుసు కానీ.. బుధవారం ఉన్నట్లుండి ఆయన చాలా సాధాహరణ వ్యక్తి లా, సీఎం ను కలవాలి, సీఎంతో మాట్లాడాలంటూ ప్రగతిభవన్ వద్ద హాల్ చల్ చేశాడు. ఎంత మొత్తుకున్న పోలీసులు మాత్రం అనుమతి లేదంటూ వెనక్కి పంపించారు. దీంతో ఆయనకు ప్రగతిభవన్ వద్ద అవమానం తప్పలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలవడానికి ప్రగతిభవన్‌కు వచ్చిన మాజీ మంత్రి జేసీ దివాకర్‌ రెడ్డికి అవమానం జరిగింది. అనుమతి లేదంటూ పోలీసులు ఆయనను భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. సీఎం లేకపోతే.. మంత్రి కేటీఆర్‌ను కలుస్తానంటూ జేసీ అన్నారు.

also read :-పోడు పట్టాలు..12 శాతం రిజర్వేషన్లేవి సీఎం కేసీఆర్ : బండి సంజయ్

అయినా అనుమతి కావాల్సిందేనని చెప్పడంతో చేసేదేవిూలేక జేసీ వెనుదిరిగి వెళ్లిపోయారు. అయితే ముందస్తు అనుమతి లేకపోతే ఎవరినీ ప్రగతిభవన్‌కు అనుమతించడం లేదు. ఎవరైనా ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ను కలవాలన్నా.. ప్రగతి భవన్‌కు వెళ్లాలన్నా.. ముందుగా అపాయింట్‌మెంట్‌ తీసుకుంటే తప్ప వాళ్లను లోపలికి పంపరు. అయితే జేసీ ఎటువంటి అనుమతి లేకుండా నేరుగా ప్రగతి భవన్‌కు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. అనుమతి లేనిదే తాము లోపలికి పంపబోమని స్పష్టం చేశారు. అనుమతైనా ఉండాలి.. లేదా ప్రగతి భవన్‌ నుంచి పెద్దలతో ఫోన్‌ అయినా చేయించాలని జేసీకి సెక్యురిటీ సిబ్బంది విజ్ఞప్తి చేశారు. అయితే తనకు అపాయింట్‌మెంట్‌ ఇచ్చేదేమిటని, తాను లోపలకు వెళతానని సెక్యూరిటీతో జేసీ వాగ్వాదానికి దిగారు. అయినప్పటికీ అపాయింట్‌మెంట్‌ లేనిదే తాము లోపలికి అనుమతించబోమని సెక్యూరిటీ నచ్చచెప్పడంతో చేసేదేవిూలేక జేసీ దివాకర్‌ రెడ్డి వెనుదిరిగారు. అంతకుముందు ప్రగతిభవన్‌లోకి వెళ్లాలని జెసి కొద్దిసేపు హల్‌చల్‌ చేశారు..

also read :-సుకుమార్‌తో ధనుష్‌ సినిమా..?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ మంత్రి, మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్‌ నేత జేసీ దివాకర్‌రెడ్డి.. ప్రగతి భవన్‌లోనికి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. అయితే, అపాయింట్‌మెంట్‌ లేకుండా సీఎంను కలిసేందుకు లేదంటూ అడ్డుకున్నారు. పోలీసులు ఎంత చెప్పినా వినకపోవడంతో జేసీని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌కు తరలించినట్టుగా తెలుస్తోంది.. ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో ఉండే జేసీ దివాకర్‌రెడ్డి.. ఆ మధ్య తెలంగాణ అసెంబ్లీలోని సీఎల్పీ కార్యాలయంలో ప్రత్యక్షమై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.. ఇప్పుడు ప్రగతి భవన్‌ దగ్గర పోలీసులతో వాగ్వాదానికి దిగి.. మరోసారి వార్తల్లోకి ఎక్కారు.