Telugu News

నేనున్నానని భరోసా నింపే నాయకుడు మన ఎంపీ నామ

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో వైరా శాసనసభ్యులు లావుడ్యా రాములు నాయక్

0

నేనున్నానని భరోసా నింపే నాయకుడు మన ఎంపీ నామ

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో వైరా శాసనసభ్యులు లావుడ్యా రాములు నాయక్

రూ .33.16 లక్షల విలువైన 70 చెక్కుల పంపిణీ

( ఖమ్మం-విజయంన్యూస్);-

ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నాను అనే భరోసా నింపి , పేదలకు ఆపనన్న హస్తం అందిస్తూ , భరోసా నింపే నాయకుడు మన ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు అని వైరా శాసనసభ్యులు లావుడ్యా రాములు నాయక్ కొనియాడారు . టీఆర్ఎస్ లోక్సభ పక్షనేత , ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు సిఫారసు మేరకు మంజూరైన రూ .33.16 లక్షల విలువైన , 70 సీఎం ఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం శనివారం సాయంత్రం ఎంపీ నామ క్యాంపు కార్యాలయంలో జరిగింది . టీఆర్ఎస్ రాష్ట్ర మహిళా నాయకురాలు మద్దినేని బేబి స్వర్ణకుమారి అధ్యక్షతన జరిగిన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ , డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం , మార్ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్ , రైతుబంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు , అశ్వారావుపేట నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకులు జారె ఆదినారాయణ తదితరులు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు .

also read :-గుర్వాయిగూడెం నర్సరికి దిక్కేవ్వరు..?

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాములు నాయక్ మాట్లాడుతూ ఆపదలో ఎవరున్నా తానున్నానని భరోసానిచ్చి , అన్ని విధాలుగా అండగా నిలిచే వ్యక్తి ఎంపీ నామ నాగేశ్వరరావు అని అన్నారు . ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలోనూ ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు ఎల్లప్పుడూ ముందు వరుసలోనే నిలుస్తారనీ , మాట తప్పని నాయకునిగా ఎంపీ నామకు ప్రత్యేకత ఉందని ఎమ్మెల్యే అన్నారు . తెలంగాణ లోక్సభ పక్షనేతగా రాష్ట్రంలోని నాలుగున్నర కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను భారత పార్లమెంటులో తన గళంతో ఎలుగెత్తి చాటిన దార్శనికుడని అన్నారు . తన రాజకీయాల్లో ఎలాంటి మచ్చలేని రాజకీయాలకు కేరాఫ్ ఎంపీ నామా నాగేశ్వరరావు నిలిచారని శాసనసభ్యులు రాములునాయక్ గుర్తుచేశారు . ఉమ్మడి జిల్లాలోని పేదలకు ఎందరికో సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్ధిక భరోసా కల్పించి వారి కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసేలా చేస్తున్న ఎంపీ నామ పార్లమెంటు సభ్యునిగా ఉండటం మనందరి అదృష్టమని అన్నారు . గ్రూపు రాజకీయాలంటే సహించని నాయకుడు , సీఎం కేసీఆర్ , యువనేత కేటీఆర్ మాత్రమే మనందరి నాయకులని దృడనిశ్చయంతో ముందుకు సాగే నాయకుడని కీర్తించారు . వైరా , అశ్వారావుపేట , ఖమ్మం నియోజకవర్గాల్లోని సీఎంఆర్ఎఫ్ లబ్దిదారులకు చెక్కులు తన చేతులమీదుగా పంపిణీ చేయడం చాలా ఆనందంగా ఉందని అన్నారు .

also read :-సోమ్లా తండాలో కోడలిని చంపిన మామ

ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం , మార్ఫెడ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బొర్రా రాజశేఖర్ , రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు , వైరా జడ్పీటీసీ సంబూరి కనకదుర్గ , ఎంపీపీ వేల్పుల పావని , కొణిజర్ల మండల టీఆర్ఎస్ నాయకులు పోట్ల శ్రీనివాసరావు , ఆత్మ కమిటీ చైర్మన్ ముత్యాల సత్యనారాయణ , తదితరులు ప్రసంగించారు . సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పీఏసీఎస్ అధ్యక్షులు చెరుకుమల్లి రవి , రైతు సమన్వయ సమితి జిల్లా కమిటీ సభ్యులు పోగుల శ్రీను , యాదవ సంఘం జిల్లానాయకులు చిత్తరు సింహాద్రి యాదవ్ , సంగుల పాటి శ్రీను , కారేపల్లి టీఆర్ఎస్ మండల అధ్యక్షులు తోటకూరి రాంబాబు , వైరా టీఆర్ఎస్ మండలాధ్యక్షులు బాణాల వెంకటేశ్వర్లు , తిరుమలాయపాలెం టీఆర్ఎస్ మండల అధ్యక్షులు బాషబోయిన వీరన్న , సీనియర్ నాయకులు తమ్మినేని కృష్ణయ్య , సొసైటీ చైర్మన్ దుగ్గినేని శ్రీనివాసరావు , తన్నీరు రవి , సోసైటీ ఛైర్మన్ ఉప్పనూతల నాగేశ్వరరావు , తీర్థాల సర్పంచ్ బాలు , కారేపల్లి మండల నాయకులు బత్తుల శ్రీను నామ సేవా సమితి అధ్యక్షులు పాల్వంచ రాజేష్ , చీకటి రాంబాబు , తాళ్లూరి హరీష్ , భార్గవ్ , రేగళ్ల కృష్ణప్రసాద్ , దోసపాటి కిరణ్ , తదితరులు పాల్గొన్నారు .