Telugu News

కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణి చేసిన ఎమ్మెల్యే

ఇచ్చోడ మండలంలోన 33 మంది లబ్ధిదారులకు పంపిణి

0

కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణి చేసిన ఎమ్మెల్యే

— ఇచ్చోడ మండలంలోన 33 మంది లబ్ధిదారులకు పంపిణి
(ఇచ్చోడ- విజయం న్యూస్) :

 

ఉమ్మడి అదిలాబాధ్ జిల్లాలలోని ఇచ్చోడ మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన 33 మంది కల్యాణలక్ష్మీ, లబ్ధిదారులకు ఇచ్చోడ లోని స్థానిక తాసీల్ధార్ కార్యాలయములో బోథ్ శాసనసభ్యులు రాథోడ్ బాపురావు చెక్కులను అందించారు. తను మాట్లాడుతూ ఎన్నో వ్యయప్రయసాలు ఓనర్చి ప్రభుత్వం ఎక్కడ సంక్షేమ పథకాలకు ఇబ్బంది కలుగకుండా అమలు పరుస్తుందని,త్వరలోనే నియోజకవర్గములో దళితబంధు పథకాన్ని కూడా అమలు పరుస్తామని,పెళ్ళిఈడు ఆడపిల్లల తల్లిదండ్రుల కష్టాలను దూరం చేసి,ఆడబిడ్డ కండ్లల్లో ఆనందం చూడడమే ప్రభుత్వ లక్షంగా కల్యాణ లక్ష్మీ పథకాన్ని నిరంతరాయంగా కేసీఆర్ అమలు పరిస్తున్నారని, 2017 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు ఇచ్చోడ మండలంలో జరిగిన 946 పెండ్లిలకు కల్యాణ లక్ష్మీ,షాధి ముబారక్ చెక్కులు అందించడం జరిగిందని అన్నారు.
— సిఎంఅర్ఎప్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే
ఇచ్చోడ మండలం కేంద్రానికి చెందిన కారే శంకర్ ను 60  వేల రూపాయలు కామ్రే లక్ష్మీ బాయి కి 60 వేల రూపాయలు బోథ్ శాసనసభ్యులు రాథోడ్ బాపురావు గారు అందించారు.
ఈ కార్యక్రమములో మండల కన్వీనర్ ఏనుగు కృష్ణ రెడ్డి, జడ్పీటీసీ సుభద్రబాయి, ఎంపీటీసీ గాడ్గే సుభాష్,సర్పంచ్ హారన్ సుభాష్ పటేల్,రాథోడ్ ప్రకాశ్, ముస్తఫా,దాసరి భాస్కర్,పురుషోత్తం రెడ్డి,గాయకాంబ్లీ గణేష్,నర్వడే రమేష్,ఆర్గుల గణేష్,షాభిర్,తాసీల్ధార్ అతికొద్దీన్,డి.టి రామారావు, లబ్ధిదారులు పాల్గొన్నారు..

allso read :- ఈ విజయం హుజూరాబాద్  ప్రజలకు అంకితం…