పండుగ పూట భార్యను భర్త కత్తితో దాడి
** సిరికొండలో విషాదం
(ఇచ్చోడ సిరికొండ విజయం న్యూస్) :
సిరికొండ మండల కేంద్రంలో పండుగ పూట దారుణం చోటు చేసుకుంది. తాగిన మైకంలో భార్యను అతి దారుణంగా కత్తితో పొడిచి భార్త పారిపోయిన సంఘటన చోటు చేసుకుంది. గ్రామస్తులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రంలోని మహాలక్ష్మివాడ కు చెందిన సూర్య వంశీ జి యమున మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. దీంతో భార్య సునీత ఆయనను మందలించింది ఇరువురి మధ్య మాటమాట పెరిగి చివరికి భర్త జి యమున కత్తితో భార్యపై దాడి చేశాడు. గొంతు పై కత్తి తో దాడి చేయగా భార్య తప్పించుకునే ప్రయత్నంలో గొంతు పక్కన మెడ భాగంలో తీవ్రంగా గాయాలయ్యాయి. సునీత కిందపడి కేకులు వేయడంతో సునీత కుటుంబ సభ్యులు ఇరుగుపోరుగు వారు అక్కడికి చేరుకోని రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న సునీత ను ప్రైవేట్ వాహనంలో ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అందరి రాకను గమనించి యమున జి అక్కడినుంచి పారిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించి పరారీలో ఉన్న యమున జి కోసం గాలిస్తున్నారు.
allso read:- గద్వేల్ లో అంబేడ్కర్ విగ్రహావిష్కరణలో ఉద్రిక్తత