Telugu News

ఆదర్శ కమ్యూనిస్టు కామ్రేడ్ సంగబత్తుల వెంకటరెడ్డి: కె.నారాయణ

సంగబత్తుల చిత్రపటానికి నివ్వాళ్ళు అర్పించిన సీపీఐ నేతలు

0

ఆదర్శ కమ్యూనిస్టు కామ్రేడ్ సంగబత్తుల వెంకటరెడ్డి: కె.నారాయణ

== సంగబత్తుల చిత్రపటానికి నివ్వాళ్ళు అర్పించిన సీపీఐ నేతలు

(కూసుమంచి-విజయం న్యూస్):

సంగబత్తుల వెంకటరెడ్డి ఆదర్శ కమ్యూనిస్టు అని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కంకణాల నారాయణ అన్నారు. కూసుమంచి మండల పరిధిలోని గైగోల్లపల్లి గ్రామానికి చెందిన తెలంగాణ సాయుధ పోరాట యోధులు, సీపీఐ సీనియర్ నాయకులు ఆదివారం వృద్ధాప్యంతో మృతి చెందారు. పార్టీ నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ గురువారం వారి స్వగ్రామానికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాలలేసి ఘనంగా నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చివరి శ్వాస వరకు కమ్యూనిస్టు పార్టీ కోసం ఆయన చేసిన కృషి అయిన లేదని కొనియాడారు. ఎన్ని అవాంతరాలు వచ్చినా 16 సంవత్సరాలు జైలు జీవితం గడిపిన పార్టీని వీడలేదని అన్నారు. పేద, గిరిజన, బడుగు బలహీన వర్గాల కోసం అనునిత్యం పోరాడారని అన్నారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటు అని ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జాతీయ సమితి సభ్యులు భాగం హేమంతరావు, జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్, సహాయ కార్యదర్శి దండి సురేష్, సిపిఐ జిల్లా సమితి సభ్యులు గుండెపంగు మల్లేష్, కూసుమంచి మండల కార్యదర్శి భూక్యా నరసింహ, సహాయ కార్యదర్శి జిల్లా లింగయ్య, మండల సమితి సభ్యులు సంగబత్తుల ఉపేందర్ రెడ్డి, దేవేందర్ రెడ్డి, పాండు రంగ చారి, జిల్లా శంకర్, జిల్లా గురవయ్య తదితరులు పాల్గొన్నారు.