Telugu News

దేశానికే ఆదర్శం తెలంగాణ ప్రభుత్వం: ఎంపీ నామ

== 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ == బీజేపీ డబుల్ ఇంజిన్ రాష్ట్రాల్లో లేని అభివృద్ధి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్నారు == వైరా మండలంలో విస్తృతంగా పర్యటించిన ఎంపీ నామ నాగేశ్వరరావు. == ఎమ్మెల్యే రాములు నాయక్, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ తో కలసి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎంపీ నామ. == విప్పలమడక, ఖానాపురం, కొండకోడిమ గ్రామాల్లో రైతు వేదికల ప్రారంభోత్సవాలు.

0

దేశానికే ఆదర్శం తెలంగాణ ప్రభుత్వం: ఎంపీ నామ
== 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
== బీజేపీ డబుల్ ఇంజిన్ రాష్ట్రాల్లో లేని అభివృద్ధి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్నారు
== వైరా మండలంలో విస్తృతంగా పర్యటించిన ఎంపీ నామ నాగేశ్వరరావు.
== ఎమ్మెల్యే రాములు నాయక్, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ తో కలసి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎంపీ నామ.
== విప్పలమడక, ఖానాపురం, కొండకోడిమ గ్రామాల్లో రైతు వేదికల ప్రారంభోత్సవాలు.
(వైరా,ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
అభివద్ది, సంక్షేమంలో దేశానికే ఆదర్శంగా నిలిచింది ఒక తెలంగాణ ప్రభుత్వమేనని, సీఎం కేసీఆర్ పరిపాలనలో బంగారు తెలంగాణగా విరాజిల్లుతోందని టీ.ఆర్.ఎస్ లోక్ సభాపక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం వైరా నియోజకవర్గంలోని వైరా పరిసర ప్రాంతాల్లో ఎమ్మెల్యే రాములు నాయక్, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ లతో కలసి పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అందులో భాగంగా విప్పలమడక ,ఖానాపురం, కొండకోడిమ గ్రామాల్లో నూతనంగా నిర్మించిన రైతువేదికలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం లో అమలు అవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలో లేవని బీజేపీ డబుల్ ఇంజిన్ రాష్ట్రాల్లో కూడా ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పథకాలను అమలు చేయాలని కోరుతున్నట్లు ఆయన తెలిపారు. రైతుల గురించి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఏ నాయకుడు ఆలోచన చేయని విధంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల పక్షాన నిలబడి అన్ని విషయాల్లో అండగా నిలిచిన విషయం గుర్తు చేశారు. ప్రస్తుతం 24 గంటల నిరంతరాయ విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఆయన తెలిపారు. రైతలకు రైతు బంధు ద్వారా పెట్టుబడి సహాయం, రైతు బీమా, రైతులకు రైతు వేదికలు ఇవి అన్ని ఒక్క తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే అమలవుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో పండిన వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం తెలంగాణ రైతుల పట్ల వివక్ష చూపిస్తే రైతులకు అండగా నిలిచి గిట్టుబాటు ధర కల్పించి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. బీజేపీ నేతలు, మంత్రులు అన్ని అబద్ధాలు చెపుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని వారి మోసం మాటలను ప్రజలు ఎవరు నమ్మొద్దని పేర్కొన్నారు.

also read :- ముచ్చర్లలో నగదు చోరీ

also read :- ఉపాధి హామీ కూలీల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, రాష్ట్ర మార్క్ పైడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, వైరా మార్కెట్ కమిటీ చైర్మన్ బిడికే రత్నం, ఎంపీపీ వేల్పుల పావని, జడ్పీటీసీ నంబూరి కనకదుర్గ, వైరా మండల అధ్యక్షులు బాణాల వెంకటేశ్వరరావు, వైరా మున్సిపల్ చైర్మన్ సూతకానీ జైపాల్, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు మిట్టపల్లి నాగేశ్వరరావు, జడ్పి కోఆప్షన్ సభ్యులు షేక్ లాల్ మొహమ్మద్, వైస్ చైర్మన్ ముల్లపాటి సీతారాములు, దిశా కమిటీ సభ్యులు జిల్లా నాయకులు కట్టా కృష్ణార్జున రావు, వైరా పట్టణ నాయకులు వనమా విశ్వేశ్వరరావు, మోట పోతుల సురేష్, ఎదునూరు శ్రీను,అప్పం సురేష్, జిల్లా సీనియర్ రైతు నాయకులు మచ్చ నరసింహారావు, మచ్చ బుజ్జి, శీలం వెంకట రెడ్డి, బూర్గు సంజీవరావు, కృష్ణారావు, జాన్ పాపయ్య, సాధo రామారావు ,దొంతెబాయిన శ్రీను, కె.వెంకటేశ్వరరావు, కరిస శ్రీను, పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు , ఏడీవో బాబురావు, వైరా ఎంపిడిఓ వెంకటపతిరాజు, తహశీల్దార్ అరుణ, వ్యవసాయ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.