ఆదర్శ పాలనే బీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం: పువ్వాడ
== పరిపాలనా సౌలభ్యం కోసమే నూతన సచివాలయం..
== లాంఛనంగా రేపు ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదగా ప్రారంభం..
== రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా ఉండాలని, ప్రజా సంక్షేమం, నాణ్యమైన పాలనా అందించాలని యోచించిన ప్రభుత్వం నూతన సచివాలయంను నిర్మించిందని, ఆ మహత్తర ఘట్టం రేపు ఆవిష్కృతం కానుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నిజం చేసేందుకు ఆవిర్భవించిన టిఆర్ఎస్ పార్టీ 22 ఏండ్ల అనతికాలంలోనే పార్టీ జాతీయ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి మేరకు స్వరాష్ట్ర ఏర్పాటు లక్ష్యాన్ని సాధించడమే కాకుండా దేశానికే ఆదర్శంగా ప్రజా పాలనను అందిస్తూ ప్రగతి పథాన ముందుకు సాగుతున్నదని అన్నారు.
ఇది కూడా చదవండి: రేపే సచివాలయ ప్రారంభానికి ముహుర్తం
ప్రజా పరిపాలలో నాణ్యత, స్పష్టత, పారదర్శకత ఉండాలనే సంకల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు తరాలకు ఆదర్శంగా నిర్మించిన డాక్టర్ అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సెక్రటేరియట్ రేపు (ఆదివారం) ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదగా లంచనంగా ప్రారంభించుకోవడం రాష్ట్రానికే గర్వకరణం అన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారని, అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో కేసీఅర్ గారి స్వీయ పర్యవేక్షణలో నిర్మాణం చేపట్టారని వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమం దేశ వ్యాప్తంగా పౌరులకు, పేదలకు, సామాన్యులకు అందాలనే ఉద్దేశంతోనే టీఆర్ఎస్ పార్టీ బీఆరఎస్ గా రూపాంతరం చెందిందని, ప్రజా ఆశీర్వాదంతో, ప్రజల ప్రోత్సాహంతో రానున్న కాలంలో ఇక్కడ అమలుఅవుతున్న పథకాలు దేశంలోని అందరూ అందుభవిస్తారని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: కలిసి పనిచేద్దాం..మళ్ళీ గెలుద్దాం: మంత్రి పువ్వాడ